Arjun Suravaram
Telangana: ఆదివారం తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో రాష్ట్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. అలానే 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే విషయాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు.
Telangana: ఆదివారం తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో రాష్ట్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. అలానే 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే విషయాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు.
Arjun Suravaram
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లింది. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పలు స్కీమ్స్ ను అమలు చేస్తున్నారు. ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500లకే గ్యాస్ సిలిండర్ కి రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి.. అర్హులు ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఆదివారం మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. సుదీర్ఘంగా మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణ కేబినెట్..200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం అమలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అదే విధంగా గ్రూప్-1 ఉద్యోగ పోస్టులకు మరో 160 అదనపు పోస్టులు కలిపి రీ-నోటిఫికేషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రజలు 200యూనిట్ల కరెంట్, 500 గ్యాస్ సిలిండర్ అమలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆమోదం తెలిపింది. అయితే అర్హులు ఎవరు అనే విషయంపై అందరిలో సందేహం వ్యక్తం అవుతోంది. అయితే ఈ విషయంపై పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారే ఈ రెండు స్కీమ్స్ కి అర్హులని తెలిపారు. తాజాగా మంత్రి మండలి సమావేశంలో ఈ రెండిటికి ఆమోదం తెలపడంతో.. మరోసారి ఎవరు అర్హులు అనే విషయం ప్రస్తావనకు వచ్చింది. 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందేందుకు వైట్ రేషన్ కార్డు వారినే అర్హులుగా ప్రభుత్వం ఎంపిక చేయొచ్చు అనే వార్తలు వినిపిస్తోన్నాయి.
ఇక ఈ అంశంతో పాటు మంత్రి మండలిలో మరికొన్ని అంశాలపై రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టీఎస్ ను టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలానే జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇక మంత్రి మండలి సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ఈ నెల8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , 500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
కులగణన చేయాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ తల్లి అంటే ఒక వ్యక్తే గుర్తుంచ్చేలా చేశారు. తాము తెలంగాణ తల్లిలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక నుంచి అన్ని రకాల వ్యవహారాలు టీఎస్ కు బదులుగా టీజీగా జరుగుతాయి. రాష్ట్ర చిహ్నం రాచరిక పాలనకు ప్రతీకగా ఉండొద్దని , రాష్ట్ర చిహ్నం మార్చాలని కేబినెట్ నిర్ణయించని ఆయన తెలిపారు. మరి.. రేవంత్ రెడ్డి మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.