Dharani
Wine Shops Closed: ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటల పాటు వైన్స్ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో తాజాగా దాన్ని పొడిగిస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..
Wine Shops Closed: ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటల పాటు వైన్స్ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో తాజాగా దాన్ని పొడిగిస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..
Dharani
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా నేడు నాలుగో విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తుండగా.. తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని చర్యలు తీసుకుంది. మే 13న పోలింగ్ నేపథ్యంలో.. 48 గంటల పాటు మద్యం షాపులు బంద్ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంటే మే 11వ తేదీన అంటే… శనివారం సాయంత్రం 6 నుంచి గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులను బంద్ చేయనున్నారు. తిరిగి మే 13వ తేదీన, పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటలకు వైన్స్ బంద్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా దాన్ని మరో రోజు పొడగిస్తూ.. ఉత్తర్వులు వెల్లడించింది.
గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మే 13 పోలింగ్ ముగిసేంతవరకు వైన్స్ బంద్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను.. మే 14 వరకు పొడిగించారు. మంగళవారం అనగా మే 14 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్‌ను పొడగిస్తూ.. సీపీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాత్రమే అని తెలిపారు. అంటే మంగళవారం ఉదయం 6 గంటల వరకు సిటీలో వైన్స్ తెరుచుకోవు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అలానే ఓట్ల కౌంటింగ్ రోజైన జూన్ 4న కూడా వైన్ షాపులు మూత పడనున్నాయి. ఎన్నికల వేళ మద్యం అక్రమ రవాణా జరిగే అవకాశం ఉండటంతో.. ఎక్సైజ్ పోలీసులు నిఘా పెంచారు. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసినా, అమ్ముతున్నా తమకు సమాచారం ఇవ్వాలన్నారు.ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాలు వేటేంసేందుకు పోటెత్తుతున్నారు. ఉదయం నుంచే పోలింగ్ సెంటర్ల వద్ద క్యూ కట్టారు. పైగా ఈరోజు వాతావరణం కాస్త చల్లబడటంతో.. జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నేడు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 94 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో ఒక్కోరకమైన పోలింగ్ శాతం నమోదైనట్లు ప్రధాన ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో సగటున 10.35 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.