iDreamPost
android-app
ios-app

Metro: హైదరాబాద్‌ మెట్రో బిగ్‌ అలర్ట్‌.. టైమింగ్స్‌లో మార్పులు

  • Published May 13, 2024 | 3:05 PM Updated Updated May 13, 2024 | 3:05 PM

హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన చేసింది. టైమింగ్స్‌ మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకు ఈ అకస్మాత్తు నిర్ణయం ఎందుకు.. ఎప్పటి వరకు ఇది అమల్లో ఉంటుంది అంటే..

హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన చేసింది. టైమింగ్స్‌ మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకు ఈ అకస్మాత్తు నిర్ణయం ఎందుకు.. ఎప్పటి వరకు ఇది అమల్లో ఉంటుంది అంటే..

  • Published May 13, 2024 | 3:05 PMUpdated May 13, 2024 | 3:05 PM
Metro: హైదరాబాద్‌ మెట్రో బిగ్‌ అలర్ట్‌.. టైమింగ్స్‌లో మార్పులు

దేశవ్యాప్తంగా నేడు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ జరుగుతుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఓటింగ్‌ నిర్వహిస్తుండగా.. తెలంగాణలో పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. ఇక ఏపీ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం ఎక్కడెక్కడో ఉన్న జనాలు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. దాంతో నిత్యం రద్దీ, ట్రాఫిక్‌ జామ్‌తో కిక్కిరిసి ఉండే హైదరాబాద్‌.. నేడు రోడ్ల మీద జనాలు లేక వెలవెలబోయింది. రోడ్లన్ని ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఓటేయడానికి ఊర్లకు వెళ్లిన జనాలు ఇవాళ సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతారు. మళ్లీ రేపు ఉదయం నుంచే రోడ్ల మీద భారీగా రద్దీ ఉంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన చేసింది. టైమింగ్స్‌ మారుస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

లోక్ సభ ఎన్నికల వేళ ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం జనాలు.. సొంత ఊర్లకు తరలి వెళ్లారు. పోలింగ్‌ అయ్యాక వారంతా మళ్లీ తిరిగి హైదరాబాద్ బాట పట్టనున్నారు. మంగళవాళం (మే 14న) ఉదయం మళ్లీ యథావిధిగా కార్యాలయాల్లో విధులకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో.. ఊర్లకు వెళ్లిన వారు.. మంగళవారం తెల్లవారుజాము సమయానికి హైదరాబాద్‌ చేరుకునే విధంగా తిరుగు ప్రయాణం ప్లాన్‌ చేసుకుంటున్నారు. అలాంటి ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం టైమింగ్స్‌లో మార్పులు చేసింది.

సాధారణంగా హైదరాబాద్ మెట్రో ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుండగా.. మే 14వ తేదీన మాత్రం ఉదయం 5 గంటల 30 నిమిషాలకే సేవలు ప్రారంభించనున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యమే తమ తొలి ప్రాధాన్యత అని తెలిపిన హైదరాబాద్ మెట్రో యాజమాన్యం.. వేకువజామున నగరానికి వచ్చే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు… మంగళ వారం నాడు రోజు కన్నా ముందుగానే సేవలు ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. దీంతో.. వేకువజామున నగరానికి చేరుకునే ప్రయాణికులు.. ఏ క్యాబో, ఆటోనో మాట్లాడుకుని వందలకు వందలు ఖర్చు చేయకుండా మెట్రో సేవలను వినియోగించుకునే అవకాశం దొరికింది. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.