iDreamPost
android-app
ios-app

HYDలో ఎంతమంది సెలబ్రిటీల దగ్గర గన్స్ ఉన్నాయో తెలుసా? వారందరిపై చర్యలు!

  • Published Apr 22, 2024 | 9:51 PM Updated Updated Apr 22, 2024 | 9:51 PM

సెలబ్రిటీల దగ్గర లైసెన్స్ కలిగిన గన్స్ ఉండడం అనేది సహజమే. ఆత్మరక్షణ కోసం గన్స్ తమ దగ్గర పెట్టుకుంటారు. అయితే గన్స్ ఉన్న ఆ సెలబ్రిటీలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే?

సెలబ్రిటీల దగ్గర లైసెన్స్ కలిగిన గన్స్ ఉండడం అనేది సహజమే. ఆత్మరక్షణ కోసం గన్స్ తమ దగ్గర పెట్టుకుంటారు. అయితే గన్స్ ఉన్న ఆ సెలబ్రిటీలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే?

HYDలో ఎంతమంది సెలబ్రిటీల దగ్గర గన్స్ ఉన్నాయో తెలుసా? వారందరిపై చర్యలు!

సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన సెలబ్రిటీల దగ్గర లైసెన్స్ కలిగిన గన్స్ ఉండడం సహజమే. ఆత్మరక్షణ కోసం ఆయుధాలను తమ వద్ద ఉంచుకుంటారు. అయితే ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు వాటిని పోలీసుల దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ లో భాగంగా గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళను డిపాజిట్ చేయమని పోలీసులు కోరుతున్నారు. కానీ ఇంకా చాలా మంది గన్ లను డిపాజిట్ చేయలేదు. హైదరాబాద్ లో 8 వేల మందికి పైగా లైసెన్స్డ్ గన్స్ ని కలిగి ఉన్నారు. అయితే వీరిలో కేవలం 3 వేల మంది మాత్రమే గన్స్ ని డిపాజిట్ చేశారు. ఆయుధాలను డిపాజిట్ చేయని వారిలో ఎక్కువ మంది సెలబ్రిటీలు, వీఐపీలే ఉన్నట్లు సమాచారం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 4600 మంది తమ లైసెన్స్డ్ గన్స్ ని డిపాజిట్ చేయగా.. ఈ పార్లమెంట్ ఎన్నికల కోడ్ లో భాగంగా ఈ సంఖ్య మరింత తగ్గింది. కేవలం 3 వేల మంది మాత్రమే గన్స్ ని డిపాజిట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పుడే లైసెన్స్ కలిగిన వారు తమ గన్స్ ని సంబంధిత పోలీస్ స్టేషన్స్ లో డిపాజిట్ చేయాలని ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే 3 వేల మంది మినహా మిగతా ఎవరూ కూడా డిపాజిట్ చేయలేదు. పోలీసులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అనుకుంటే పోలీసుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని డిపాజిట్ చేయకపోయినా పర్లేదు. తమకు ప్రాణహాని ఉందని భావిస్తే సంబంధిత ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకుని లైసెన్స్డ్ గన్ ను తమ దగ్గరే ఉంచుకోవచ్చు.

అయితే ఈ విషయంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా మంది ఇంకా సమాచారం ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలను తమ దగ్గరే పెట్టుకున్నారని అంటున్నారు. హైదరాబాద్ లో ఎక్కువగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎక్కువ మంది లైసెన్స్డ్ గన్స్ ని కలిగి ఉన్నారు. ఈ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 894 లైసెన్ద్స్ గన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాంకు సిబ్బందితో పాటు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సభ్యుల దగ్గర కూడా గన్స్ ఉన్నాయి. అయితే వీరికి పోలీసులు మినహాయింపు ఇచ్చారు. ఇప్పటి వరకూ సమాచారం ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా కంటిన్యూ చేస్తూ గన్స్ ని డిపాజిట్ చేయనివారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రాణహాని ఉందని భావిస్తే ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచిస్తున్నారు.