iDreamPost
android-app
ios-app

స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరిక.. ఇకపై అవి అమ్మితే చర్యలే!

Education Department: తెలంగాణలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాకు విద్యాశాఖ కీలన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అలాంటి పనులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

Education Department: తెలంగాణలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాకు విద్యాశాఖ కీలన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అలాంటి పనులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరిక.. ఇకపై అవి అమ్మితే చర్యలే!

నేటి పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగం, మంచి స్థాయిలో జీవించాలంటే చదువు ఎంతో అవసరం. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పించి చదివిస్తుంటారు. తమ తలకు మించిన భారం అయినా.. పిల్లల భవిష్యత్ కోసం ఎంతో కష్టపడుతుంటారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అడ్డగోలుగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. యూనిఫామ్ నుంచి ఎగ్జామ్ ఫీజు వరకు ఎన్నోరకాలుగా వసూళ్లు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. అధిక ఫీజులు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. ఆ నిబంధనలు ఎవరూ పాటించడం లేదని వార్తలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు విద్యాశాఖ కీల్ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు లాభాపేక్ష కోసం ఎలాంటి విక్రయాలు చేయవొద్దని జిల్లా విద్యాధికారి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు నోటీస్ విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ అన్ – ఎయిడెడ్ పాఠశాల ప్రాంగణాల్లో యూనిఫామ్స్, షూ, బెల్ట్, పుస్తకాలు మొదలైన వాటిని అధిక డబ్బుకు అమ్ముతూ అడ్డగోలిగా దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయ విషయం తెలిసిందే. ఇక పై అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖాధికారి హెచ్చరించారు. పై ఆదేశాల ప్రకారం జిల్లాలోని డిప్యూటీ ఎడ్యూకేషన్ అధికార్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఇన్స్ పెక్టర్లు ప్రేవేట్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తారని.. వారి కంటే ముందే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని కోరారు.

కోర్టు ఆదేశాల ప్రకారం కౌంటర్ లో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రమాలు జరపవొద్దని.. అలాంటివి ఏవైనా ఉంటే అవి వాణిజ్యేతర, లాభాపేక్ష, నో – లాస్ ప్రాదిపదికన ఉండాలన్నారు. వీటిని ఉల్లంఘిచిన పాఠశాలకు తక్షణమే నోటీసులు జారీ చేయబడతాయని హెచ్చరించారు. అంతేకాదు ప్రైవేట్ పాఠశాలలను ఎల్లప్పు పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నామని నోటీసులో స్పష్టం చేశారు విద్యాశాఖ. ప్రైవేట్ స్కూల్ లో తమ పిల్లలను చేర్పించి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతుంటారని.. ఫీజులతో పాటు ఇలాంటి ప్రైవేట్ దందాలతో వారిపై మరింత భారం పడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి