iDreamPost
android-app
ios-app

DSC అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం

  • Published Jul 08, 2024 | 10:06 PM Updated Updated Jul 08, 2024 | 10:06 PM

TG DSC 2024 Exam Schedule: తెలంగాణలోని డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ పై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ పరీక్షలు ఎప్పుడు జరుగనున్నాయంటే?

TG DSC 2024 Exam Schedule: తెలంగాణలోని డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ పై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ పరీక్షలు ఎప్పుడు జరుగనున్నాయంటే?

DSC అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 20తో ముగిసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. అయితే టీచర్ అభ్యర్థులు గత కొన్ని రోజులుగా డీఎస్సీ పోస్టులు పెంచాలని.. పరీక్షలను వాయిదా వేయాలని నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాశాఖ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ పై కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ పరీక్షలపై స్పష్టతనిచ్చింది.

తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవవచ్చని పేర్కొంది. అయితే ఇటీవలే టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో ప్రిపరేషన్ కు సమయం సరిపోవడం లేదని డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు సోమవారం ఉదయం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని విద్యాశాఖ ప్రకటించింది. మొట్టమొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించనున్నారు. రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి.

టీఎస్‌ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలు:

  • జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
  • జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
  • జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
  • జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష
  • జులై 24న స్కూల్ అసిస్టెంట్ – బయలాజికల్ సైన్స్ పరీక్ష
  • జులై 25న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు
  • జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష.
  • ఆగస్టు 5 వరకు మిగతా పరీక్షలను నిర్వహించనున్నారు.