iDreamPost

టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. DSC దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఎడిట్‌ ఆప్షన్

టీఎస్ డీఎస్సీ దరఖాస్తుల్లో తప్పులు దొర్లిన అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది పాఠశాల విద్యాశాఖ. నవంబర్ 1 (బుధవారం) నుంచి 5 వరకు దరఖాస్తుదారులు వెబ్‌సైట్‌ను సంప్రదించి తప్పులను సవరించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన వెల్లడించారు.

తెలంగాణలో ఎంతో కాలం నుంచి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్తను అందించిన విషయం తెలిసిందే. పాఠశాలల్లో ఖీళీగా ఉన్న 5,089 టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్‌ 6న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవాలి సూచించింది. కాగా ఆ గడువు తేదీని మరో వారం రోజులు పెంచి అక్టోబర్ 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది పాఠశాల విద్యాశాఖ. అయితే దరఖాస్తుల ప్రక్రియ ముగియగా తాజాగా డీఎస్సీ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. దీని కోసం ఎడిట్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

టీఎస్ డీఎస్సీ దరఖాస్తుల్లో తప్పులు దొర్లిన అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది పాఠశాల విద్యాశాఖ. నవంబర్ 1 (బుధవారం) నుంచి 5 వరకు దరఖాస్తుదారులు వెబ్‌సైట్‌ను సంప్రదించి తప్పులను సవరించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన వెల్లడించారు. అభ్యర్థులు https ://schooledu.telangana.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించి తప్పులుంటే సవరించుకోవచ్చని వెల్లడించింది. కాగా చాలా కాలం తరువాత వచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ కు మొత్తంగా 1.77 లక్షల దరఖాస్తులు వ‌చ్చినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుంచి 30 వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలను ఎన్నికల నేపథ్యంలో అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. టీఎస్ డీఎస్సీకి అప్లై చేసుకున్న బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఎలాగైనా టీచర్ ఉద్యోగం సాధించాలని ప్రిపరేషన్ లో మునిగిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి