Krishna Kowshik
Ponguleti Srinivasa Reddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. మొత్తం 16 ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు. అయితే ఇప్పుడే కాదు.. గతంలో కూడా పొంగులేటి నివాసాలపై ఈడీ రైడ్స్ నిర్వహించడం గమనార్హం.. అయితే.
Ponguleti Srinivasa Reddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. మొత్తం 16 ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు. అయితే ఇప్పుడే కాదు.. గతంలో కూడా పొంగులేటి నివాసాలపై ఈడీ రైడ్స్ నిర్వహించడం గమనార్హం.. అయితే.
Krishna Kowshik
తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఆయన నివాసం, వ్యాపార సంస్థలు, బంధువుల నివాసాల్లో ఏకకాలంలో ఈ రైడ్స్ నిర్వహించింది. మొత్తం 16 చోట్ల సోదాలు చేపడుతున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ నుండి వచ్చిన 16 ఈడీ బృందాలు..జూబ్లీ హిల్స్‌లో ఉన్న మంత్రి నివాసం, హిమాయత్ సాగర్‌లోని ఫామ్ హౌస్, పొంగులేటి కుమార్తె ఇంట్లో, శ్రీనివాసరెడ్డికి చెందిన ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు, బంధువుల నివాసాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. సీఆర్పీఎఫ్, పోలీసుల భద్రత మధ్య రైడ్స్ చేపడుతున్నారు అధికారులు. కాగా, ఈ దాడుల వెనుక బీజెపీ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ దాడులు నిర్వహిస్తుందని మండిపడుతున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు. ఐటీ, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందంటూ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇది రాజకీయ కక్షలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది. దీనికి కారణం.. ఆయన బీజెపీలోకి చేరకపోవడం. గత ఏడాది పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తమ పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులపై సస్పెండ్ వేటు వేసింది. దీంతో పార్టీని వీడిన పొంగులేటి.. ఏ కండువా కప్పుకుంటారోనన్న సందిగ్దత నెలకొంది.
ఇదే సమయంలో బీజెపీ నేత ఈటెల రాజేందర్ స్వయంగా పొంగులేటి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే సున్నితంగా తిరస్కరించారు పొంగులేటి. పార్టీ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరడం.. బీజెపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో కేంద్ర అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ నుండి పోటీ చేసి గెలుపొంది.. మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు పొంగులేటి. అప్పుడు బీజెపీలో చేరేందుకు నో చెప్పడంతోనే వరుసగా ఈడీ సోదాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే.. పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు చిన్న వయస్సులోనే పెద్ద వ్యాపార వేత్తగా మారాడు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ వ్యవహారాలను ఆయనే చూస్తున్నాడు. ఆయన పేరిట రూ.1300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ క్రమంలో వరసగా ఈడీ రైడ్స్ జరుగుతున్నాయన్న టాక్ నడుస్తుంది. మొత్తానికి పొంగులేటి నివాసాల్లో ఈడీ వరుస దాడులు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. ఈ సోదాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.