iDreamPost
android-app
ios-app

బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో భూకంపం.. కొన్ని సెకండ్లపాటు..

  • Published Jan 27, 2024 | 6:32 PM Updated Updated Jan 27, 2024 | 7:01 PM

ఇటీవల భారత ఉపఖండాన్ని భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి. తరుచూ భూకంపాల వల్ల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది.

ఇటీవల భారత ఉపఖండాన్ని భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి. తరుచూ భూకంపాల వల్ల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది.

బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో భూకంపం.. కొన్ని సెకండ్లపాటు..

ఇటీవల భారత ఉపఖండాన్ని భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి. తరుచూ భూకంపాల వల్ల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ఎక్కువగా భారత్, అండమాన్ నికోబార్ దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్థాన్ తదితర దేశాల్లో వరుసగా భూకంపాలు అలజడి సృష్టిస్తున్నాయి. గత ఏడాది టర్కీ, సిరియాలో ఏర్పడిన భూకంపం కారణంగా 50 వేల మంది మృత్యువాత పడ్డారు.. వేల మంది గాయాలపాలయ్యారు.. కోట్లలో నష్టం వాటిల్లింది. భూకంపాల వల్ల ప్రాణ నష్టం మాత్రమే కాదు.. ఆస్తి నష్టం వాటిల్లుతుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా లో శనివారం పలు చోట్ల సాయంత్రం భూకంపం చోటు చేసుకుంది. జిల్లాలోని న్యాల్ కల్, ముంగి తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితిలో ప్రజలు భయంతో ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలకు సంబంధించి అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సమాచారం సేకరించే పనిలో ఉన్నారు.  ఈ భూకంప తీవ్రత ఎంత వరకు ఉంది అనేది తెలియరాలేదు. అంతేకాదు ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఏది ఏమైనా జిల్లాలో భూకంపం అనగానే ప్రజలు ఒక్కసారే ఉలిక్కి పడ్డారు.