Krishna Kowshik
దసరా పండుగ వచ్చిందంటే.. ఆఫర్లే ఆపర్లు.. ఈ కామర్స్ సంస్థల నుండి వస్త్ర దుకాణాలు, వస్తువులు, చివరకు చికెన్, మటన్ షాపులు కూడా ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. ఇప్పుడు ఓ గ్రామంలోని యువకులు ధమాకా ఆఫర్ ప్రకటించారు.
దసరా పండుగ వచ్చిందంటే.. ఆఫర్లే ఆపర్లు.. ఈ కామర్స్ సంస్థల నుండి వస్త్ర దుకాణాలు, వస్తువులు, చివరకు చికెన్, మటన్ షాపులు కూడా ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. ఇప్పుడు ఓ గ్రామంలోని యువకులు ధమాకా ఆఫర్ ప్రకటించారు.
Krishna Kowshik
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి తర్వాత బాగా జరుపుకునే పండుగ దసరా. పిల్లలకు ఈ పండుగ అంటే మహా సరదా. ఎందుకంటే.. చదువులకు, పుస్తకాలకు వారం పది రోజులకు వరకు గుడ్ బై చెప్పి.. ఎంచక్కా.. ఇంటి పట్టున ఉంటూ..టీవీలో కార్టూన్స్ చూస్తూనో, సెల్ ఫోన్స్‌లో వీడియో గేమ్స్ ఆడుకుంటూనో ఎంజాయ్ చేయోచ్చునని. చిన్నలే కాదు ఈ పండుగను పెద్ద వాళ్లు సైతం ఇష్టపడుతుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో తీరుకొక్క రీతిగా పండుగ జరుపుకుంటారు. ఆంధ్రాలో విజయదశమి అంటూ జరుపుకుంటే.. తెలంగాణలో బతుకమ్మ పండుగ నిర్వహిస్తుంటారు. ఇక ఫెస్టివల్ వచ్చిందంటే.. ఆఫర్లు కూడా వస్తుంటాయి. ఈ కామర్స్ సంస్థల నుండి వస్త్ర దుకాణాలు, చికెన్, మటన్ షాపులు ఆఫర్లను దంచికొడుతుంటాయి. కస్టమర్లను ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ గ్రామంలో యువత కూడా నిరుడు లెక్క దసరా ఉండకూడదని వినూత్నమైన ఆలోచన చేశారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని వెల్మకన్నె గ్రామంలోని యువకులు.. ఈ దసరాకు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించి.. గ్రామస్థులను టెంప్ట్ చేసేందుకు సిద్ధం అయ్యారు. దోటీ శ్రీను, లోగి, భార్గవ్ అనే యువకులు వంద రూపాలకే పది కిలో మేకతో పాటు పలు ఆఫర్లు ప్రకటించారు. ‘రూ. 100 కొట్టు మేకను పట్టు’ అనే ధమాకా ఆఫర్ తీసుకు వచ్చారు. గ్రామ ప్రజలకు తెలిసేలా.. ఊరు నిండా పోస్టర్లు, కటౌట్స్ కట్టించడంతో ఈ ఆఫర్ గురించి తెలిసింది. ఇది ఓ స్కీం. ఇందులో చేరాలంటే.. కూపన్ రూపంలో తీసుకోవాలి. ఒక్కో కూపన్ ధర రూ. 100గా నిర్ణయించారు. లక్కీ డ్రా ద్వారా ఐదుగురు విజేతలను ఎంపిక చేస్తారు. ఈ ఆఫరే ఊరమాస్ అనుకుంటే.. ఇందులో బహుమతులు కూడా సూపర్ ఉన్నాయి. మొదటి బహుమతి 10 కిలోల మేక ఇస్తారు. రెండవ బహుమతిగా 2 బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్స్, మూడవ బహుమి కింద కాటన్ బీర్స్, నాల్గొవ బహుమతి 2 నాటు కోళ్లు, ఐదో బహుమతిగా 1 రాయల్ స్టాగ్ ఫుల్ అందిస్తారట. ఇది పూర్తిగా మందు రాయళ్లకు కిక్‌నిచ్చే వార్తే. ఇది పూర్తిగా లక్ బేసిస్ ఉంటుంది.
ఈ డ్రాను దసరా కానుకగా.. అక్టోబర్ 10న నిర్వహించనున్నారు. ఆ ఊరి బస్టాండ్ లో చిన్న పిల్లలతో తీయించనున్నట్లు బ్యానర్‌లో స్పష్టం చేశారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యువకులు. ఇప్పటి వరకు స్కీం అంటే మహిళలకు ఉపయోగపడేలా చీరలు, గిన్నెలు, వంట సామాన్లు ఇచ్చేవారు. కానీ ఈ సారి మందు బాబులకు ఫేవరేట్ ఐటెమ్స్ పెట్టి అసలైన దసరా పండుగ రుచి చూపిస్తున్నారు. అందులోనూ దసరా పండుగ అంటే ముక్క, చుక్క లేనిదే ఫెస్టివల్ కాదు.. తెలంగాణ వాసులకు. ఈ సమయంలో వంద రూపాయలతో మాంచి కిక్కించే ఆఫర్స్ పెట్టి టాక్ ఆఫ్ ది విలేజ్ అయ్యారు యువకులు. మరీ ఈ సరికొత్త కల్చర్.. ఒక్క గ్రామానికే పరిమితమౌతుంది.. మరిన్ని ఊళ్లకు చేరి.. మరో సంక్రాంతి పండుగను తలపిస్తోంది చూడాలి. ఈ ధమాకా ఆఫర్ ఎలా ఉందో.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.