iDreamPost
android-app
ios-app

నిన్న ఒక్కరాత్రిలో 2700 మందిపై కేసు నమోదు! అడ్డంగా దొరికారు!

  • Published Jan 01, 2024 | 2:01 PM Updated Updated Jan 01, 2024 | 2:30 PM

Drunk and Drive Cases: డిసెంబర్ 31 రాత్రి దేశం మొత్తం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఫుల్ జోష్ లో ఉన్నారు. రాత్రి 12 గంటల వరకు మేల్కొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

Drunk and Drive Cases: డిసెంబర్ 31 రాత్రి దేశం మొత్తం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఫుల్ జోష్ లో ఉన్నారు. రాత్రి 12 గంటల వరకు మేల్కొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

నిన్న ఒక్కరాత్రిలో 2700 మందిపై కేసు నమోదు! అడ్డంగా దొరికారు!

దేశ వ్యాప్తంగా నిన్న న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిన్నా పెద్ద అందరూ సంతోషంతో సెలబ్రెషన్స్ చేసుకున్నారు. డిసెంబర్ 31, ఇది ఆదివారం రావడంతో జోష్ మరింత పెరిగిపోయింది. మద్యం షాపులు, మటన్, చికెన్, పిష్ మార్కెట్లో కిట కిటలాడిపోయాయి. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబుల జోష్ అంతా ఇంతా కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీస్ శాఖ కొన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనఖిలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేశారు.. ఈ సందర్భంగా ఒక్కో వ్యక్తి 544, 484 పాయింట్లు రావడం షాక్ కి గురి చేసింది. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మొత్తం కలిపి 2700 కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఎక్కువగా హైదరాబాద్ పరిధిలో 1500 లకు పైగా కేసులు నమోదు కాగా, సైబరాబాద్ పరిధిలో 1240 కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో 938 బైకులు, 21 ఆటోలు, 7 భారీ వాహనాలు, 275 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక న్యూ ఇయర్ సందర్భంగా యువత ఎక్కువగా బయట తిరుగుతూ నానా హంగామా చేశారు. ఈ క్రమంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ  పట్టుబడిన వారిలో 18 నుంచి 25 వయసు ఉన్న వారు 382 మంది, 26 నుంచి 35 సంవత్సరాలు ఉన్నవారు 536 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు, వాహనదారులు పలు చోట్ల తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తెలంగాణలో మూడు రోజుల వ్యవధిలో 29 నుంచి 31 వరకు ఏకంగా రూ.658 కోట్ల మేర లిక్కర్, బీర్లు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఏది ఏమైనా కొత్త సంవత్సరం వేడుకలు మంచి జోష్ గానే చేసినట్లు తెలుస్తుంది.. అయితే మద్యం సేవించి వేగంగా వాహనాలు నడపడం వల్ల  ఏదైనా ప్రమాదాలు జరిగితే వారి కుటుంబాల్లో విషాదం నెలకొంటుందని.. అందుకే కఠిన నియమాలు అమలు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.