iDreamPost
android-app
ios-app

జ్వరానికి వాడుతున్న ఈ మందులన్నీ నకిలీవే! సీజ్‌ చేసిన TG డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు

  • Published Sep 01, 2024 | 4:54 PM Updated Updated Sep 01, 2024 | 4:54 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరోసారి  డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు తనిఖీలు  ముమ్మరంగా కొనసాగించారు. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లోని అధికారులు మెడికల్‌ షాపులను తనిఖీలు చేయగా కొన్ని షాకింగ్‌ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరోసారి  డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు తనిఖీలు  ముమ్మరంగా కొనసాగించారు. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లోని అధికారులు మెడికల్‌ షాపులను తనిఖీలు చేయగా కొన్ని షాకింగ్‌ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

  • Published Sep 01, 2024 | 4:54 PMUpdated Sep 01, 2024 | 4:54 PM
జ్వరానికి వాడుతున్న ఈ మందులన్నీ నకిలీవే! సీజ్‌ చేసిన TG డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు అనుమతిలేని క్లినిక్‌లు, మెడికల్‌ షాపులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎప్పటికప్పుడు పలు ప్రాంతాల్లో అక్రమంగా,అనుమతిలేని క్లినిక్‌లు,మెడికల్‌ షాపులను గుర్తించి ఆయా షాపుల్లో నకిలీ, గుర్తింపు లేని మందులను తనిఖీ చేసి సీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా  మరోమారు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పలు మెడికల్‌ షాప్‌ లలో తనిఖీలు నిర్వహించనున్నారు. దీంతో పలు జిల్లాలో అత్యధిక రేటుకు అమ్ముకుంటున్న మందులతో పాటు కొన్ని నకిలీ మందులను సీజ్‌ చేశారు. ఆ వివరాలేంటో చూద్దాం.

తాజాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరోసారి  డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు తనిఖీలు  ముమ్మరంగా కొనసాగించారు. ఈ క్రమంలోనే.. రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పలు మెడికల్‌ షాపులను  తనిఖీలు చేయగా కొన్ని షాకింగ్‌ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చేశారు. ఈ మేరకు తనీఖీలో భాగంగా కామారెడ్డి జిల్లాల్లో ఓ మెడికల్ షాపులో అత్యధిక రేటుకు అమ్ముతున్న ఇట్రాబెర్ -100mg మెడిసిన్స్ తో పాటు మరోవైపు నకిలీ మందులను గుర్తించి అధికారులు వాటిని  సీజ్ చేశారు.

అలాగే మరోవైపు నిజామాబాద్ లోని ఓ మెడికల్‌ షాపులో  హైపర్ టెన్సన్ కి గురవుతున్నావారికి వ్యాధి తగ్గుతుందంటూ నమ్మబలికి నకిలీ ఆయుర్వేదిక్ మెడిసిన్, కార్డిమాప్ టాబ్లెట్స్ ను కూడా సీజ్‌ చేశారు. ఇకపోతే నగరంలోని కూకట్ పల్లిలో జ్వరం తగ్గుతుంది అంటూ ప్రజలకు  అమ్ముతున్న జ్వరా కీర్తి వాటి ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ను కూడా అధికారులు గుర్తించి వాటిని సీజ్‌ చేశారు.

ఇదిలా ఉంటే.. నగరంలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న సరే నకిలీ రాయులకు ఏమాత్రం  భయం,   బెరుకు అనేది లేకుండా.. అనుమతిలేని, నకిలీ, ఎక్స్‌పైర్‌ అయిన మందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కనుక ప్రస్తుతం వర్ష కాలం కావడంతో   రాష్ట్రంలో  జ్వరాల బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సమయంలో  జ‍్వరాల బారిన పడినవారు, ఏదైనా వ్యాధులకు గురైన వారు, వీలైనంత వరకు లైసెన్స్‌ లేనీ మెడికల్‌ షాపుల్లో మందులను విక్రయించవద్దని, సాధ్యమైనంత వరకు ఆసుపత్రికి వెళ్లి వైద్యుని సంప్రాదించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో మరిన్ని మెడికల్‌ షాపులు, అనుమతి లేని క్లినిక్‌ లను తనిఖీ చేయనున్నామని, నకిలీ మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటమని హెచ్చరించారు.