iDreamPost
android-app
ios-app

ఎన్నికల్లో కీలక పాత్ర.. మీ వేలికి వేసే సిరా చుక్క ధర ఎంతో తెలుసా?

ఎన్నికల్లో ఓటువేసే ప్రతి ఒక్కరి ఎడమచేతి చూపుడు వేలుపై సిరా కనిపించడం అందరికీ తెలిసిందే. అసలు ఈ పద్ధతిని ఎప్పుడు మొదలుపెట్టారు? ఆ ఇంకును ఎక్కడ తయారు చేస్తారు, దాని ధర ఎంత? అనే వివరాలు మీలో ఎంతమందికి తెలుసు..? దానిపై పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎన్నికల్లో ఓటువేసే ప్రతి ఒక్కరి ఎడమచేతి చూపుడు వేలుపై సిరా కనిపించడం అందరికీ తెలిసిందే. అసలు ఈ పద్ధతిని ఎప్పుడు మొదలుపెట్టారు? ఆ ఇంకును ఎక్కడ తయారు చేస్తారు, దాని ధర ఎంత? అనే వివరాలు మీలో ఎంతమందికి తెలుసు..? దానిపై పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎన్నికల్లో కీలక పాత్ర.. మీ వేలికి వేసే సిరా చుక్క ధర ఎంతో తెలుసా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి ఊపందుకుంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండడంతో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. రాష్ట్ర ఓటర్లు తమ ఓట్ల ద్వారా నాయకుల భవితవ్యం తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. నవంబరు 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ రోజున తెలంగాణ ప్రజలు ఓటువేసి.. తమ రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించనున్నారు. తాజాగా ఎన్నికల్లో పలు ఆసక్తికరమైన విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. అదే ఎన్నికల పోలింగ్ రోజున ఓటువేసే వ్యక్తికీ ఎన్నికల సిబ్బంది సిరా గుర్తు ఎందుకు వేస్తారూ అని. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ సిరా వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది. మొదటిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చాలా సమస్యలు ఎదుర్కొంది. ఓటు వేసినవాళ్లు మళ్లీ ఓటు వేసేందుకు వస్తుండటంతో ఎలా అడ్డుకోవాలో అర్థం కాలేదు. అప్పుడే కొన్నిరోజుల వరకు చెరిగిపోని సిరాతో గుర్తు వేయాలన్న ఆలోచన వచ్చింది. అదే “బ్లూ ఇంక్” పద్ధతి. భారతదేశంలో 1962లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా బ్లూ ఇంక్ వాడటం మొదలుపెట్టారు. అంతటి గొప్ప ఘనత మొదటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్‌కు దక్కుతుంది. ఎన్నికల్లో సిరా వాడే సంప్రదాయం అప్పుడే మొదలైంది. 37(1) నిబంధన ప్రకారం ఓటర్ ఎడమచేతి వేలుపై సిరా గుర్తును చూడాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేప్పుడు పెట్టిన సిరా గుర్తు 15 రోజులపాటు అలాగే ఉంటుంది. గోళ్లపై నుంచి గుర్తు మొత్తం చెరిగిపోవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది.

ఈ సిల్వర్ నైట్రేట్ పేపర్‌పై రాసేందుకు ఉపయోగించే ఇంక్ కాదు. ఇది కేవలం వేలుపై పూయడానికి మాత్రమే వినియోగిస్తారు. దీనిని వేలిపై గోరు కింద అప్లై చేయగానే చర్మంపై ఉండే ఉప్పుతో కలిసి చెరిగిపోకుండా గుర్తు ఏర్పడుతుంది. ఆ గుర్తును వెంటనే చెరపడం అంత సులువుకాదు. అందుకే ఎన్నికల సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఎన్నికల్లో ఉపయోగించే ఈ ఇంక్‌ను మైసూర్ పెయింట్స్ & వార్నిష్ లిమిటెడ్ (MVPL)తయారు చేస్తుంది. భారతదేశంలో జరిగే ఎన్నికల్లోనే కాదు… కెనెడా, కాంబోడియా, మాల్దీవ్స్, నేపాల్, దక్షిణాఫ్రికా, టర్కీ లాంటి దేశాలకు కూడా ఇక్కడ్నుంచే ఎన్నికల ఇంక్ ఎగుమతి అవుతుంది. నేషనల్ ఫిజికల్ ల్యాబరేటరీ, నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సాయంతో ఈ సిరాను తయారు చేస్తోంది ఎంవీపీఎల్. ఇంతకు ఈ సిరా ధర ఎంతో తెలుసా? 10 మి.లీ. బాటిల్‌కు రూ.160. అంటే.. ఒక లీటర్ ఇంకు ధర రూ.16వేలు ఉంటుంది.