Diesel tanker: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. బకెట్లతో ఎగబడిన స్థానికులు!

Diesel tanker: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. బకెట్లతో ఎగబడిన స్థానికులు!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ వంటి వాటిని సరఫరా చేసే వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఘోరాలు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘటన తృటిలో తప్పింది.

తరచూ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ వంటి వాటిని సరఫరా చేసే వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఘోరాలు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘటన తృటిలో తప్పింది.

మనిషికి ఆశ అనేది సహజం. అయితే దానికి ఓ  పరిధి ఉంటే మంచిది. లేకపోతే… అదే ఆశ మనిషి ప్రాణాలను తీస్తుంది. ముఖ్యంగా ఏదైనా  వస్తువులు, సరుకలతో వెళ్తున్న వాహనాలు బోల్తా కొట్టిన సమయంలో జనం వాటి కోసం ఎగబడుతుంటారు. అవి ప్రమాదాకరమైనవి కాకపోతే ఎటువంటి ప్రమాదం జరగదు. అయితే ప్రమాదకరమైనవి అయితే మాత్రం చాలా దారుణం చోటుచేసుకుంటుంది. గతంలో ఓ  ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడగా.. దానికోసం జనం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే మంటలు చేలరేగి..దాదాపు 42 మంది చనిపోయారు. తాజాగా అలాంటి పెను ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తరచూ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ వంటి వాటిని సరఫరా చేసే వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఘోరాలు జరుగుతుంటాయి. అయితే జనాలు ఏదైనా వాహనం పడటమే ఆలస్యం.. దాని దగ్గరకి వెళ్తే.. ఎంత ప్రమాదమో ఎవరికి తెలియదు. కేవలం ఫ్రీగా వస్తుందనే ధ్యాసే తప్ప.. ఏదైనా జరిగితే ఎంతటి ప్రాణ నష్టం జరుగుతుందో ఎవరం చెప్పలేము. తాజాగా తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాల్లో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో డీజిల్‌ను తీసుకు వెళ్లడానికి జనాలు డబ్బాలు, బకెట్లతో ఎగబడ్డారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పర్వతాపూర్‌ గ్రామం సమీపంలోకి రాగానే ప్రమాదవాశాత్తు డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఇక వాహనం బోల్తా పడటాన్ని గమనించిన స్థానికులు డబ్బాలు, బకెట్లతో తరలి వచ్చిన డీజిల్ తీసుకువెళ్లడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎవరికీ అందిన కాడికి వారు బకెట్లు, బిందెలతో డీజిల్‌ ను తీసుకెళ్లారు. అక్కడ  ఏదైన మంటలు అంటుకుంటే..పెను ప్రమాదం జరుగుతుందనే విషయాన్ని కూడా మర్చిపోయి..డీజిల్ కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో సహాయక చర్యలు చేపట్టి..రోడ్డపై ఏర్పడిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇక డీజిల్ కోసం జనం ఎగబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలోనూ పాకిస్థాన్ ప్రాంతంలో పెట్రోల్ వాహనం ప్రమాదానికి గురైంది. స్థానికంగా ఉండే వారు పెట్రోల్ ను తీసుకునేందుకు పెద్ద ఎత్తున ఆ ట్యాంకర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడి నుంచో చిన్నపాటి నిప్పు రవ్వ ఏర్పడి..ట్యాంకర్ పై పడింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పేలిపోయి.. 150 మంది చనిపోయారు.  ఇలా మనిషి ఏదో ఉచితంగా వస్తుందని పొంచి ఉన్నప్రమాదాన్ని గుర్తించలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరి.. ఇలాంటి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments