iDreamPost
android-app
ios-app

లాస్య నందిత మరణాన్ని ముందే ఊహించిందా.. ఆమె ఒంటిపై అన్ని

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే. అయితే ఆమె ఇటీవల రెండు ప్రమాదాల నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడినప్పటికీ.. మూడోసారి మృత్యువు కబళించింది. అయితే ఆమె తన మరణాన్ని ముందే ఊహించిందా..?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే. అయితే ఆమె ఇటీవల రెండు ప్రమాదాల నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడినప్పటికీ.. మూడోసారి మృత్యువు కబళించింది. అయితే ఆమె తన మరణాన్ని ముందే ఊహించిందా..?

లాస్య నందిత మరణాన్ని ముందే ఊహించిందా.. ఆమె ఒంటిపై అన్ని

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్య నందిత ఏప్రిల్ 23న తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో మరణించారు. శుక్రవారం ఉదయం ఓఆర్ఆర్ పై కారు ప్రమాదం జరగడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె పీఎ ఆకాశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కారు ఎదురు సీట్లోనే కూర్చొన్నారు. ఈ యాక్సిడెంట్ ధాటికి వాహనం ఫ్రంట్ నుజ్జునుజ్జయ్యింది. ఆమె మరణ వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. బీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కంటోన్మెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు లాస్య. చిన్న వయస్సుల్లోనే ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి.. నియోజకవర్గంలోని సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తూ ఉన్నారు.

ఇంతలో కుటుంబ సభ్యులను, అభిమానునల్ని, నియోజకవర్గ ప్రజలను శోక సంద్రంలో ముంచేసి ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లాస్య నందిత, ఆకాశ్‌లను కారు నుండి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఎమ్మెల్యే చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. అదే సమయంలో ఆమె ఒంటిపై చాలా తాయత్తులు ఉండటంతో ..లాస్య తన మరణం గురించి ముందే ఊహించిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఆమెను మృత్యువు రెండు సార్లు వెంబడించింది. ఎందుకంటే.. లాస్య నందిత ఎమ్మెల్యేగా పదవి చేపట్టిన ఈ మూడు నెలల కాలంలో.. రెండు ప్రమాదాలను ఎదుర్కొన్నారు.

డిసెంబర్ 24న బోయిన పల్లి వద్ద ఉన్న వీఆర్ ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు లాస్య నందిత. ఆ సమయంలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. వెంటనే అక్కడ సిబ్బంది లిఫ్ట్ డోర్ బద్దలు కొట్టి లాస్యను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ఇదే నెలలో మరో ప్రమాదం నుండి తప్పించుకున్నారు లాస్య. ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభ్యలో పాల్గొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. నార్కటప్లలి సమీపంలోని చర్ల పల్లి వద్ద ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఆమె కారు వేగంగా ట్రాఫిక్ హోంగార్డులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ హోంగార్డ్ మరణించగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే తలకు గాయమైంది. అయితే ఇక్కడ కూడా ప్రాణాలతో బయట పడ్డ లాస్య 10 రోజుల గ్యాప్‌లో కారు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు.

అయితే వరుసగా జరుగుతున్న ప్రమాదాలు.. ఆమెను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ జరగడానికి ముందు రోజు రాత్రి కూడా సంగారెడ్డి జిల్లా ఆరూరు సమీపంలోని సూఫీ మిస్కిన్ దర్గాను దర్శించుకున్నారు. అక్కడ అర్థరాత్రి వరకు ప్రత్యేక పూజలు చేశారు కుటుంబ సభ్యులు. తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకున్నారు లాస్య, ఆమె కుటుంబ సభ్యులు. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు శామీర్ పేట నుండి పటాన్ చెరు వైపు వెళ్తున్న క్రమంలో పెను ప్రమాదంలో ఆమె మరణించారు. తండ్రి, దివంగత ఎమ్మెల్యే సాయన్న చనిపోయిన ఏడాది ఇలా గడిచిందో లేదో.. లాస్య నందిత కూడా ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. కాగా, ఈ ఘటనపై కంప్లయింట్ చేశారు లాస్య కుటుంబ సభ్యులు. ఆమె పీఎ ఆకాశ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.