చూస్తే చాక్లెట్లే.. ఓపెన్ చేస్తే లక్షల విలువైన..

ఈజీ మనీ కోసం ఇటీవల కొంతమంది కేటుగాళ్ళు ఎన్నో రకాల తప్పుడు పనులు చేస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి అక్రమంగా డబ్బు, బంగారం స్మగ్లింగ్ చేస్తు పోలీసులకు బుక్ అవుతున్నారు.

ఈజీ మనీ కోసం ఇటీవల కొంతమంది కేటుగాళ్ళు ఎన్నో రకాల తప్పుడు పనులు చేస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి అక్రమంగా డబ్బు, బంగారం స్మగ్లింగ్ చేస్తు పోలీసులకు బుక్ అవుతున్నారు.

ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. స్మగ్లింగ్, డ్రగ్స్, అక్రమాయుధాల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఏదో ఒక సమయంలో పోలీసులకు చిక్కిపోతున్నారు. విదేశాల నుంచి అక్రమంగా డబ్బు, బంగారం, కొన్ని రకాల జీవాలను స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఎన్నిరకాలుగా అడ్డుకట్ట వేసినా కేటుగాళ్ళు ఏదోఒక రకంగా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు లో కోట్లు విలువచేసే వజ్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్ళు విదేశాల నుంచి బంగారం, కరెన్సీ, డ్రగ్స్ అక్రమంగా స్మగ్లింగ్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు అధికారులు వీరి ఆగడాలకు అడ్డు‌కట్ట వేస్తూనే ఉంటారు. అయితే కొత్త కొత్త పద్దతులు కనిపెట్టి మరీ స్మగ్లింగ్ కార్యాకలాపాలను కొనసాగిస్తున్నారు దుండగులు. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో భారీ ఎత్తున వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. హైదరాబాద్ కి చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఇద్దరు చాక్లెట్ కవర్ లో భారీస్థాయిలో వజ్రాలు అమర్చారు. పైకి చూడటానికి అవి అచ్చం చాక్లెట్స్ లా కనిపిస్తున్నాయి. తనికీ చేసే సమయంలో వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఆ వ్యక్తులు చాక్లెట్స్ లో డైమండ్స్ దాచి ఉంచడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. చాక్లెట్ కవర్స్ లో దాచిన డైమండ్స్ విలువ అక్షరాలా రూ.6 కోట్ల విలువు ఉంటుందని అధికారులు తెలిపారు. వాటితో పాటు రూ.9.83 లక్షల విదేశీ కరెన్సీ, రూ. లక్ష నగదు గుర్తించారు. వారి వద్ద వజ్రాలు, కరెన్సీకి సంబంధించిన సరైన ద్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. నిత్యం శంషాబాద్ లో కేటుగాళ్ళు ఏదో ఒక రకంగా బంగారం, వజ్రాలు, విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ చేస్తూనే ఉంటారు. మరికొంతమంది వన్యప్రాణులను సైతం విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తు పట్టుబడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

Show comments