iDreamPost
android-app
ios-app

రైల్వేస్‌కి షాకిచ్చిన ప్రయాణీకులు.. ఏకంగా రన్నింగ్ ట్రైన్‌ని ఆపేసి..

రైలు ప్రయాణాలంటే భయపడేలా చేస్తున్నాయి కొన్ని సంఘటనలు. ప్రయాణీకులను ఇబ్బందికి గురి చేస్తున్నాయి రైల్వేస్. తమకు కోసం వస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారు ప్యాసింజర్లు.

రైలు ప్రయాణాలంటే భయపడేలా చేస్తున్నాయి కొన్ని సంఘటనలు. ప్రయాణీకులను ఇబ్బందికి గురి చేస్తున్నాయి రైల్వేస్. తమకు కోసం వస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారు ప్యాసింజర్లు.

రైల్వేస్‌కి షాకిచ్చిన ప్రయాణీకులు.. ఏకంగా రన్నింగ్ ట్రైన్‌ని ఆపేసి..

రైలు ప్రయాణాలంటే ఇష్టపడని వారుండరు కానీ.. రిజర్వేషన్ చేయించుకోకుండా ఎక్కితే పాట్లు తప్పవు. ఇక రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ కొన్ని సార్లు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ప్రయాణీకులు. ఒక్కో చోట ఫ్యాన్ పనిచేయకపోవడం, టాయిలెట్స్ క్లీన్‌గా లేకపోవడం, నీళ్లు లభించకపోవడం, ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పురుగులు రావడం, పాచిపోయిన ఆహార పదార్దాలు అందించడం వంటి సమస్యలు ఉంటాయి. అంతేనా టైంకి ఫ్లాట్ ఫాం మీదకు రాదు. పట్టాలపైకి వచ్చిన తర్వాత కూడా ఫ్లాట్ ఫాం మీద ఉందో  ఎనౌన్స్ మెంట్ ఉండదు. సమయానికి గమ్య స్థానాలకు చేర్చదు. ఎక్కడ పడితే అక్కడ క్రాసింగ్ పేరుతో మారుమూల ప్రాంతాల్లో రైలు నిలిచిపోతుంటుంది.

అక్కడ దొంగల బెడద కూడా ఉంటుంది. కానీ కొన్ని సార్లు ప్రయాణీకులు సర్దుకుపోతూ ఉంటారు. కొన్ని సార్లు హంగామా చేస్తుంటారు. ఇప్పుడు ఇదే జరిగింది. ఓ రైలులో ఏసీ పనిచేయడం లేదన్న కారణంగా.. రైల్వేకి షాక్ ఇచ్చారు. రైలును ఆపివేసి.. నిరసన చేపట్టారు ప్రయాణీకులు. ఈ ఘటన దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. అసలే బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలను తాళలేక చాలా మంది ఏసీ టికెట్‌ను కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రయాణీకులకు అసౌకర్యాన్ని కలిగించి నిరసనకు దిగేలా చేసింది ఆ రైలు ప్రయాణం. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ నుండి ముంబయికి వెళ్లే దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ బోగీల్లోని ఓ కంపార్ట్ మెంట్‌లో ఏసీ పనిచేయడం లేదు.

Train stopped due to AC not working

లింగం పల్లి రైల్వే స్టేషన్ నుండి బయలు దేరిన రైలు మిరజాపల్లి దగ్గరకు రాగానే.. ప్రయాణీకుల్లో అసౌకర్యం కోపంగా మారి కట్టలు తెంచుకుంది. దీంతో ప్రయాణీకులు మిరజాపల్లి దగ్గర రైలును ఆపేసి ఆందోళనకు దిగారు. బలవంతంగా రైలును ఆపేశారు. ఎందుకు ఆపారంటూ అడిగిన లోకో పైలట్‌తో ప్రయాణీకులు వాగ్వాదానికి దిగారు. రైలులో ఏసీ సరిగ్గా వర్క్ కావడం లేదని పేర్కొన్నారు. అంతేనా రైల్వే శాఖకు లేఖను సోషల్ మీడియా ద్వారా అందించారు. ఏసీ బోగీలకు కిటికీలు ఉండవు. అటు ఏసీ లేక, ఇటు గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ప్రయాణీకులు. గాలి రాకపోవడంతో ప్రయాణీకలు అస్వస్థతకు గురయ్యే అవకాశాలున్నాయని పేర్కొంటూ లేఖ రాసి.. ట్విట్టర్‌లో రైల్వే శాఖకు ట్యాగ్ చేశారు.