Dharani
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈడీ అధికారులు శుక్రవారం నాడు కవితను అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్‌కు కారణం.. ఓ వ్యక్తి ఇచ్చిన స్టేట్‌మెంట్ అని తెలుస్తోంది. ఆ వివరాలు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈడీ అధికారులు శుక్రవారం నాడు కవితను అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్‌కు కారణం.. ఓ వ్యక్తి ఇచ్చిన స్టేట్‌మెంట్ అని తెలుస్తోంది. ఆ వివరాలు..
Dharani
దేశాన్ని కుదేపిసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం సాయంత్రం కవిత అరెస్ట్ జరగ్గా.. ఈడీ అధికారులు పంచనామాను రూపొందించారు. దీనిలో కీలక విషయాలు వెల్లడించారు. వాటి ప్రకారం.. మార్చి 15న శుక్రవారం మధ్యాహ్నం 1.45 నుంచి 6.45 గంటల వరకు ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు చేశారు. పీఎమ్‌ఎల్‌ఏ యాక్ట్-19ను అనుసరించి సాయంత్రం 5.20 గంటలకు ఆమెను అరెస్టు చేసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. ఆ తర్వాత శుక్రవారం రాత్రంతా ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనే కవితను ఉంచినట్లు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా శుక్రవారం నాడు కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. నేడు అనగా శనివారం మధ్యాహ్నం వరకు విచారించి.. ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపర్చనున్నారు. అయితే.. ఈకేసులో ఇప్పటికే అరెస్టు చేసిన అమిత్ అరోరాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే.. కవిత అరెస్ట్‌కు కారణం అమిత్ అరోరానే అని తెలుస్తోంది. అతడు ఇచ్చిన సమాచారంతోనే కవితను అరెస్టు చేసినట్టు సమాచారం.
ఈడీ అధికారులు గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరాను విచారిస్తుండగా.. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని అతడు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే.. ఢిల్లీ లిక్కర్స్ స్కాం కేసులో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. కవిత అరెస్ట్ నేపథ్యంలో.. శనివారం ఉదయం అమిత్ అరోరాతో కలిపి మరోసారి ఆమెను విచారించనున్నారు. మధ్యాహ్నం తర్వాత కవితను కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో కవితను అరెస్టు చేస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కవిత అరెస్ట్ విషయం తెలియడంతో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు.. కేసీఆర్ నివాసం వద్దకు చేరుకున్నాయి. ఈడీ అధికారులను అడ్డగించే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీఛార్జ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. కవితను రాత్రి మొత్తం ఈడీ కార్యాలయంలోనే ఉంచడంతో.. ఆఫీసు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. శనివారం ఉదయం వైద్య పరీక్షల తర్వాత అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు.
ఇక కవిత అరెస్ట్ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయల్దేవి వెళ్లారు. ఈ విషయంపై సీయినర్ న్యాయవాదులతో చర్చించి.. ముందు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేయనున్నారు. అంతేకాక ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో ఉండటంతో.. కవితను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.