Dharani
Delhi Flooded Incident-Telangana Girl Student Death: ఆ యువతి ఐఏఎస్ కావాలని కలలు కన్నది. తండ్రికి దీని గురించి చెప్పింది. ఆయన కూడా ఒప్పుకున్నాడు. అందుకోసం చదువుతుండగా.. అనుకోని సంఘటన ఆమె జీవితాన్ని కబళించింది. ఆ వివరాలు..
Delhi Flooded Incident-Telangana Girl Student Death: ఆ యువతి ఐఏఎస్ కావాలని కలలు కన్నది. తండ్రికి దీని గురించి చెప్పింది. ఆయన కూడా ఒప్పుకున్నాడు. అందుకోసం చదువుతుండగా.. అనుకోని సంఘటన ఆమె జీవితాన్ని కబళించింది. ఆ వివరాలు..
Dharani
ఆ యువతి బాగా చదువుకుంది. ప్రైవేటు ఉద్యోగం వద్దని.. సమాజానికి సేవ చేయాలని భావించింది. అందుకు కలెక్టర్ కావడమే ఏకైక మార్గం అని భావించింది. అందుకు కోసం కష్టపడి చదువుతుంది. త్వరలోనే ఆమె జీవిత లక్ష్యాన్ని చేరుకునేది. కానీ ఇంతలో చోటు చేసుకున్న ఒక్క సంఘటన ఆ యువతి కలను కల్లలు చేసింది. కలెక్టర్ కావాల్సిన యువతి.. జీవితం కడతేరింది. ఐఏఎస్‌గా ఇంటికి రావల్సిన బిడ్డ.. మృతదేహంగా మారడం చూసి ఆమె తల్లిదండ్రుల గుండె బద్దలయ్యింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ జీవితం ఇలా అర్థంతరంగా ముగియడం వారిని కలచి వేస్తోంది. గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఆ వివరాలు..
ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్‌ను వరద ముంచెత్తిన ఘటనలో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. శనివారం నాడు ఈ దారుణం చోటు చేసుకోగా.. మృతి చెందిన వారిలో తెలంగాణ, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన తానియా సోని(22) అనే యువతి మృతి చెందింది. ఈ ఘటనతో శ్రీరాంపూర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆ వివరాలు.. బిహార్ ఔరంగాబాద్‌కు చెదిన విజయ్ కుమార్ సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. నస్పూర్లోని సీసీసీ టౌన్‌షిప్ బీ-2 కంపెనీ క్వార్టర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇక విజయకుమార్ భార్య పేరు బబిత కాగా.. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయి సోని. రెండో కుమార్తె లక్నోలో బీటెక్ చేస్తోంది. కుమారుడు ఆదిత్యకుమార్ హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతున్నాడు.
సోని గతేడాది ఢిల్లీలోని అగ్రసేన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. కలెక్టర్ కావాలనేది ఆమె కల. దాని గురించి తండ్రికి చెప్పింది. ఆయన కూడా అందుకు అంగీకరించడంతో.. మూడు నెలల క్రితం రావూస్ కోచింగ్ సెంటర్‌లో చేర్పించారు. అక్కడ కోచింగ్ తీసుకుంటుంది సోని. ఇలా ఉండగా.. శనివారం సాయంత్రం ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో కురిసిన భారీ వష్టాల కారణంగా ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉన్న భవనం బేస్‌మెంట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడం మొదలయ్యింది. ఇది గమనించిన విద్యార్థులు.. అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ అదే సమయంలో కరెంట్ పోవడంతో.. బేస్‌మెంట్‌లోని లైబ్రరీలోని బయోమెట్రిక్ గేట్ జామ్ అయ్యింది. దాంతో విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. బల్లలపై నిల్చుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.
చూస్తుండగానే.. 10-12 అడుగుల లోతు నీళ్లు చేరాయి. పరిస్థితిని గమనించిన అక్కడివారు విద్యార్థులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అర్థరాత్రి వరకు రెస్య్కూ ఆపరేషన్ కొనసాగగా ఆదివారం తెల్లవారుజామున సోనితో పాటు యూపీకి చెందిన శ్రేయ యాదవ్, కేరళకు నెవిన్ డాల్విన్ మృతి చెందారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వారి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటలనో స్టడీ సర్కిల్ యజమానిని రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో.. బేస్‌మెంట్‌లోకి నీరు చేరిందని పోలీసులు విచారణలో అంగీకరించాడు.