iDreamPost

చిన్న వయస్సులోనే కుమార్తెకు గుండె పోటు.. కన్నీరు మున్నీరైన తండ్రి

చావు ఎప్పుడు ఎటు నుండి ఎలా వస్తుందో చెప్పడం కష్టమౌతుంది. అయితే గతంలో 60 ఏళ్ల పై బడిన వ్యక్తుల్లో అరుదుగా కనిపించే గుండె పోటు.. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా దాడి చేస్తుంది. తాజాగా న్యూ ఇయర్ వేళ...

చావు ఎప్పుడు ఎటు నుండి ఎలా వస్తుందో చెప్పడం కష్టమౌతుంది. అయితే గతంలో 60 ఏళ్ల పై బడిన వ్యక్తుల్లో అరుదుగా కనిపించే గుండె పోటు.. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా దాడి చేస్తుంది. తాజాగా న్యూ ఇయర్ వేళ...

చిన్న వయస్సులోనే కుమార్తెకు గుండె పోటు.. కన్నీరు మున్నీరైన తండ్రి

లబ్ డబ్ అంటూ చప్పుడు చేసే పిడికెడంత చిట్టి గుండె.. సడెన్‌గా మూగబోతుంది. సడి చేయకుండా మిన్నకుండిపోతుంది. పోనీ అనారోగ్య సమస్యలు ఉన్నాయా అంటే అదీ లేదు. కాటికి కాలు చాపుతున్న ముసలోల్లను తీసుకుపోతుందా అంటే అదీ కూడా కాదూ. జీవితంపై ఎన్నో ఆశలతో, ఆశయాలతో బతుకుతున్న యువతీ యువకుల పాలిట మృత్యు శకటంగా మారుతోంది. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలుస్తుంది. చెట్టంత పిల్లలు, చేతికి అందివచ్చిన బిడ్డల్ని గుండె పోటు బలి తీసుకోవడంతో.. కన్నీరు మున్నీరు అవుతున్నారు కన్నోళ్లు. తమకు తలకొరువు పెట్టాల్సిన పిల్లలకు.. వీరే చితికి నిప్పంటిచడం విచారకరం.

కరీంనగర్ బోయవాడకు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఇంటిని కన్నీటి సంద్రం చేసేసింది హార్ట్ టాక్. కానిస్టేబుల్ చిన్న కూతురు పుల్లూరి ఐశ్వర్య గుండె పోటుతో కన్నుమూసింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తనయ.. చనిపోయిందని తెలిసే సరికి కుటుంబం శోక సంద్రంలో మునిగి తేలిపోయింది. వివరాల్లోకి వెళితే. హెడ్ కానిస్టేబుల్ కూతురు ఐశ్వర్య.. గౌహతి ఐఐటిలో చదువుతుంది. డిసెంబర్ 31న జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో ఐశ్వర్య పాల్గొని అక్కడే తన నివాసానికి చేరుకుంది. అయితే మరుసటి రోజు అనగా.. న్యూ ఇయర్ రోజునే ఆమె అస్వస్థతకు గురై.. బాత్రూములో అపస్మారక స్థితిలో పడి ఉంది. స్నేహితులు గమనించి.. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.

ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు స్నేహితులు. గౌహతి చేరుకుని.. కూతురు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు తల్లిదండ్రులు. ఆమె మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకు వచ్చి ఈ నెల 3న అంత్యక్రియలు నిర్వహించారు. ఐశ్వర్య మరణ వార్తతో బోయవాడలో విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువులు, స్నేహితులు.. కంటతడి పెట్టుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంటికి తిరిగి రావాల్సిన కూతురు.. ఇలా రావడంతో తల్లడిల్లిపోయాడు తండ్రి. ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతున్న సంగతి విదితమే. అందుకే ఐసీఎంఆర్.. శారీరకంగా, మాససికమైన ఒత్తిడికి గురికావద్దని చెబుతూ వస్తుంది. చిన్న వయస్సులోనే గుండె పోటుతో మృతి చెందడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి