nagidream
తండ్రి పడే కష్టాన్ని అందరూ అర్ధం చేసుకోలేరు. కేవలం ఆ కష్టం విలువ తెలిసిన పిల్లలే అర్ధం చేసుకుంటారు. ఈ విషయంలో అమ్మాయిలు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి అమ్మాయిల్లో మేస్త్రి కూతురు ఒకరు. ఈ అమ్మాయి తన నాన్న కోసం ముందుచూపుతో ఆలోచించింది. ఈ అమ్మాయి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టాపర్ గా నిలిచింది. టాపర్ గా నిలవడానికి.. నాన్న కోసం ఆలోచించడానికి చిన్న కథ ఉంది. అది తెలిస్తే అందరూ ఈ అమ్మాయిలానే ఆలోచిస్తారు.
తండ్రి పడే కష్టాన్ని అందరూ అర్ధం చేసుకోలేరు. కేవలం ఆ కష్టం విలువ తెలిసిన పిల్లలే అర్ధం చేసుకుంటారు. ఈ విషయంలో అమ్మాయిలు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి అమ్మాయిల్లో మేస్త్రి కూతురు ఒకరు. ఈ అమ్మాయి తన నాన్న కోసం ముందుచూపుతో ఆలోచించింది. ఈ అమ్మాయి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టాపర్ గా నిలిచింది. టాపర్ గా నిలవడానికి.. నాన్న కోసం ఆలోచించడానికి చిన్న కథ ఉంది. అది తెలిస్తే అందరూ ఈ అమ్మాయిలానే ఆలోచిస్తారు.
nagidream
ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు కూడా సత్తా చాటుతున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు కూడా సత్తా చాటారు. వీరిలో వనిత అనే విద్యార్థిని ఉంది. ఈమె పది ఫలితాల్లో 10జీపీఏ సాధించి స్కూల్ టాపర్ గా నిలిచింది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రానికి చెందిన చెన్నారెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమార్తె వనిత.. ఈ అరుదైన ఘనత సాధించింది. ధర్మారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ చదువుకుంది. అయితే తండ్రి మేస్త్రీ పని చేస్తుంటారు. నాన్న పడే కష్టానికి తన చదువు భారం అవ్వకూడదని వనిత కష్టపడి చదవాలని నిర్ణయించుకుంది.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలనేది తన కల అని.. ఫ్యూచర్ లో ఇంజనీరింగ్ చదవాలంటే నాన్నకి ఫీజులు భారం కాకూడదని.. అందుకే ముందు నుంచి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే ఫ్రీ సీటు వస్తుందని ఆలోచించింది. అందుకే కష్టపడి, ఇష్టపడి బాగా చదివింది. ఏకంగా స్కూల్ టాపర్ గా నిలిచింది. ధర్మారంలో ఉన్న గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు తనకెంతగానో సపోర్ట్ చేశారని.. వారి వల్లే తాను స్కూల్ టాపర్ గా నిలిచానని వనిత వెల్లడించింది. ధర్మారంలోనే ఇంటర్ పూర్తి చేసి.. ఆ తర్వాత ఎన్ఐటీ లేదా ఐఐటీలో సీటు సాధించాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. తమ కూతురు స్కూల్ టాపర్ గా నిలవడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాను మేస్త్రి పని చేస్తానని.. పెద్దగా చదువుకోలేదని కానీ బాగా చదువుకోమనే తన కూతురికి చెప్పానని అన్నారు. ఇక పదో తరగతి ఫలితాల్లో వనితతో పాటు మిగతా విద్యార్థినులు కూడా సత్తా చాటారు. ధర్మారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు విజయకేతనం ఎగురవేశారని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ బి. సంగీత తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో గురుకుల స్కూల్ విద్యార్థినులు 99 శాతం ఉత్తీర్ణత సాధించారని.. పి. వనిత అనే విద్యార్థిని 10/10 జీపీఏ సాధించి స్కూల్ టాపర్ గా నిలిచిందని అన్నారు. ఆ తర్వాత 9.8 జీపీఏతో కె. కావ్యలహరి అనే అమ్మాయి సెకండ్ టాపర్ గా నిలిచిందని ప్రిన్సిపాల్ అన్నారు. 25 మంది స్టూడెంట్స్.. 9.0 నుంచి 9.9 జీపీఏతో ఉత్తమ్ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ అభినందించారు. మరి తండ్రి పడే కష్టాన్ని అర్ధం చేసుకుని.. బాగా చదివితే ఫీజులు కట్టే పరిస్థితి ఉండదు.. డబ్బుతో కాదు మార్కులతోనే ఎన్ఐటీలో గానీ ఐఐటీలో గానీ ఇంజనీరింగ్ సీటు సంపాదించాలన్న లక్ష్యంతో ఉన్న ఈ బాల సరస్వతి.. కలలు ఫలించాలని ఆశిద్దాం.