iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. తెలంగాణ పోలీస్ యాప్ హ్యాక్ !

  • Published Jun 07, 2024 | 1:09 PM Updated Updated Jun 07, 2024 | 1:09 PM

Cyber Criminals Hacked: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సెక్యూరిటీ వ్యవస్థలో ఎంత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నా.. కొంతమంది సైబర్ నేరగాళ్లు రక్షణ వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Cyber Criminals Hacked: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సెక్యూరిటీ వ్యవస్థలో ఎంత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నా.. కొంతమంది సైబర్ నేరగాళ్లు రక్షణ వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

బ్రేకింగ్: బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. తెలంగాణ పోలీస్ యాప్ హ్యాక్ !

ఇటీవల సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉన్న చోట ఉంటూనే టెక్నాలజీ సాయంతో అమాయకులను దోచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు సంబంధించిన సోషల్ మాధ్యమాలు.. రక్షణకు సంబంధించిన నెట్ వర్క్, యాప్స్ ని హ్యాక్ చేస్తున్నారు. సైబర్ నేరాను ఎంతగా కట్టడి చేస్తున్నా కొత్త కొత్త టెక్నాలజీతో సైబర్ మాఫియా రెచ్చిపోతుంది. ఈ మధ్యనే తెలంగాణ పోటీస్ ‘హాక్-ఐ’ యాప్ ని హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పోలీసులకు సవాల్ విసురుతూ ఏకంగా పోలీస్ యాప్‌నే హ్యాక్ చేశారు. ఈ విషయం వెలుగు లోకి రావడంతో అలర్ట్ అయ్యారు అధికారులు.వివరాల్లోకి వెళితే..

దేశంలో టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. అపాయాలు అంతకు మించి ఉన్నాయని అంటున్నారు. ఇటీవల అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నెరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే కాదు.. సెలబ్రెటీలను టార్గెట్ చేసుకొని వారికి సంబంధించిన సోషల్ మాధ్యమాలు హ్యాక్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఇన్ని రోజులు సామాన్యులకే భద్రత లేకుండా చేస్తున్నారంటే.. ఇప్పుడు వీరి కన్ను పోలీస్ వ్యవస్థపై పడింది. ఏకంగా పోలీస్ యాప్ ని హ్యాక్ చేశారు  కేటుగాళ్లు. తాజాగా TSCOP యాప్ ని హ్యాక్ చేశారు. అంతేకాదు ఈ యాప్ ని 120 డాలర్లకు విక్రయిస్తున్నట్లు ఆన్ లైన్ లో ప్రకటన చేశారు. ఈ యాప్‌లో డిపార్ట్‌మెంట్ కి సంబంధించిన 12 లక్షల మంది డాటా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదుచేసుకున్న పోలీసులు హ్యాకింగ్ కి పాల్పపడిన వారిని వెంటనే పట్టుకుంటామని అన్నారు అధికారులు.

ఇదిలా ఉంటే.. పోలీస్ ‘హాక్ – ఐ’ యాప్ హ్యాకింగ్ భారిన పడిన విషయం తెలిసిందే. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ‘హాక్ – ఐ’ ని తయారు చేశారు. ఈ యాప్ హ్యాకింగ్ కు గురి కావడంతో కీలక సమాచారం హ్యాకర్ల చేతిలో పడిందని అంటున్నారు.  ఎవరైనా సమాచారం ఇచ్చేందుకు.. ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ ని అందుబాటులోకి తెచ్చారు.ఈ యాప్ కి గురి కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యార్. ఈ యాప్ లో దాదాపు 2 లక్ష మందికి సంబంధించిన ఆధార్, ఫోన్ నెంబర్లు వాటి వివరాలు ఉన్నాయి. ఈ సమాచారం ద్వారానే హ్యాక్ కి గురై ఉండవొచ్చని భావిస్తున్నారు. దీనిపై సైబర్ సెక్యూరిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అపహరణకు గురైన సమాచారంలో కేటుగాళ్లు బెదిరింపులకు పాల్పపడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.