P Venkatesh
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ డిసెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు చలాన్ల రాయితీకి భారీ స్పందన లభిస్తోంది. ప్రభుత్వంపై కనక వర్షం కురిపిస్తోంది.
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ డిసెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు చలాన్ల రాయితీకి భారీ స్పందన లభిస్తోంది. ప్రభుత్వంపై కనక వర్షం కురిపిస్తోంది.
P Venkatesh
తెలంగాణ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ నెలలో వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీని ప్రకటించింది. దీంతో తమ వాహనాలపై వేలకు వేలు పేరుకుపోయిన పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు మంచి అవకాశం లభించినట్లయింది. కాగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ డిసెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు చలాన్ల రాయితీకి భారీ స్పందన లభిస్తోంది. ప్రభుత్వంపై కనక వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 76 లక్షలకు పైగా చలాన్లను వాహనదారులు క్లియర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలైందంటే?
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చలానాలను విధిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని కొన్ని సార్లు చలాన్ల మొత్తం ఆ బండి విలువ కంటే కూడా ఎక్కువై పోతుంటుంది. ఈ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. టూ వీలర్స్, ఆటోలపై ఉన్న పెండింగ్ చలాన్లకు 80 శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికల్స్ కు 60 శాతం రాయితీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాహనాదారులు చలాన్లను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఇక, రాష్ట్రంలో మూడు కోట్ల 59 లక్షల పెండింగ్ చలాన్స్ కట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 76 లక్షల 79 వేల చలాన్స్ క్లియర్ అయినట్లు సమాచారం.
కాగా చలాన్లపై రాయితీకి భారీగా స్పందన వస్తుండడంతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటి వరకు 66కోట్ల 77లక్షలు వసూలైనట్లు సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. పెండింగ్ చలాన్ల రాయితీకి భారీ స్పందన వస్తుండడంతో ప్రభుత్వం ఈనెల పదో తేదీ వకు డిస్కౌంట్‌తో చలాన్లను చెల్లించేందుకు వాహనదారులకు అవకాశం కల్పించింది. ఇంకా పెండింగ్ చలాన్లను క్లియర్ చేయని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వాహనదారులు మీ సేవా, టీ వ్యాలెట్, పేటీఎంల ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. చెల్లింపులకు ఇంకా ఐదు రోజుల సమయం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనున్నది. మరి పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.