iDreamPost
android-app
ios-app

దగ్గుబాటి సురేష్, వెంకటేష్, రానాలపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

  • Published Jan 29, 2024 | 11:45 AM Updated Updated Jan 29, 2024 | 1:52 PM

హైదరాబాద్‌లోని ఫిల్మిం నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా తన హోటల్ ను దగ్గుబాటి హీరోలు కూల్చివేశారంటూ కోర్టును ఆశ్రయించాడు నందకుమార్ అనే వ్యక్తి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు..

హైదరాబాద్‌లోని ఫిల్మిం నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా తన హోటల్ ను దగ్గుబాటి హీరోలు కూల్చివేశారంటూ కోర్టును ఆశ్రయించాడు నందకుమార్ అనే వ్యక్తి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు..

  • Published Jan 29, 2024 | 11:45 AMUpdated Jan 29, 2024 | 1:52 PM
దగ్గుబాటి సురేష్, వెంకటేష్, రానాలపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

ఫిల్మిం నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతపై తెలంగాణలోని నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది న్యాయ స్థానం. దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసులు నమోదుకు ఆదేశించింది. నటుడు విక్టరీ వెంకటేష్, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, ఆయన ఇద్దరు కుమారులు రానా, అభిరామ్ లపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ధిక్కరించి డెక్కన్ కిచెన్ కూల్చివేశారంటూ నందకుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్నాడు నంద కుమార్. పోలీసుల సహకారంతో తన హోటల్ ను కూల్చివేశారని, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ధిక్కరిస్తూ జేసీబీతో అక్రమ కూల్చివేతలకు పాల్పడ్డారని, కోట్ల రూపాయల నష్టం కలిగించారని పేర్కొన్నాడు.

ఉద్దేశపూర్వకంగా ఈ కూల్చివేతలు జరిగాయంటూ నందకుమార్ పేర్కొన్నాడు. కోట్ల విలువైన భవనాన్ని కూల్చివేయడంతో పాటు ఫర్నిచర్ ను ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. నిర్మాత సురేష్ బాబుతో సహా దగ్గుబాటి హీరోలపై కేసులు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వెంకటేశ్, రానా, అభిరామ్, సురేష్ ఐపీసీలోని 448, 452,380, 506, 120 బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఫిర్యాదు మేరకు నాంపల్లి కోర్టు విచారణ చేపడుతోంది. జూన్‌లో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న దగ్గుబాటి హీరోలు కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet