Covid Cases:దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. నేడు ఎన్ని నమోదయ్యాయంటే

యావత్తు దేశాలను గడగడ లాడించిన కరోనా వైరస్ తీవ్ర ఉద్రికతను నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కరోనా వైరస్ మళ్లీ మొదలైంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదయ్యాయి. అది ఎంత అంటే..

యావత్తు దేశాలను గడగడ లాడించిన కరోనా వైరస్ తీవ్ర ఉద్రికతను నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కరోనా వైరస్ మళ్లీ మొదలైంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదయ్యాయి. అది ఎంత అంటే..

ప్రపంచ దేశాలను కుదిపేసిన కరోనా మహమ్మారి గురించి అందరికి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకి అడుగు పెట్టాలంటే వణికిపోయేవారు. లక్షల్లో కేసులు నమోదు కావడం, ప్రజలు ప్రాణాలను పోగట్టుకోవడం వంటి అతి భయంకరమైన పరిస్థితిని తలుచుకుంటే.. ఇప్పటికి వెన్నులో దడ పుడుతుంది. కాగా, ఇప్పుడు ఇప్పుడే అంతా సద్దుమణిగింది అనుకొనే క్రమంలో మళ్లీ పిడుగు లాంటి వార్త ప్రజల గుండేల్లో  ఆందోళనను పుట్టిస్తోంది. అదేమిటంటే.. దేశంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందడం అనేది తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకి ఈ కేసుల సంఖ్య అనేది క్రమేపి పేరిగిపోతుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

దేశవ్యాప్తంగా మారణహోమం సృష్టించిన కరోనా వైరస్ మళ్లీ మొదలైయ్యింది. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నాయి. గత 10 రోజుల డేటాను పరిశీలించగా సగటున 500 నుంచి 600 కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ కరోనా వైరస్ కు సంబంధించి యాక్టివ్ కేసుల బులెటిన్ (డిసెంబర్31) ఉదయం 8 గంటలకు విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 కోవిడ్ కేసులు నమోదైయ్యాయి. గత 227 రోజుల తర్వాత ఇదే అత్యధిక కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 4,309 వరకు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే.. కొత్త కేసులతోపాటు, మరో ముగ్గురు కరోనా బారిన పడి మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణించిన వాళ్లలో కేరళ, కర్ణాటక, బిహార్ రాష్ట్రాల్లో కరోనా పేషెంట్లు ఒక్క ఒక్కరు చొప్పున మరణించారు.

గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మంది పైగా బాధితులు ఈ మహమ్మారి సోకి మరణించారు. అలాగే గడిచిన 2023 డిసెంబర్ 5 వరకు దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు నామమాత్రంగానే నమోదైయ్యాయి. కానీ, కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి చెందడం, పైగా శీతాకాలం కావడం వలన ఈ కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

అయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. రికవరీ రేటు 98.81 శాతం. కాగా, కొన్ని నివేదికల ప్రకారం బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కూడా ఈ జేఎన్.1 వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు, ప్రభుత్వం సూచిస్తున్నారు. మరి, భారీగా పెరుగుతున్న ఈ కరోనా కేసుల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments