iDreamPost
android-app
ios-app

మహిళలకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. రూ.10 లక్షల ఇన్సూరెన్స్

  • Published Mar 15, 2024 | 9:19 AM Updated Updated Mar 15, 2024 | 9:19 AM

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే మహిళ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే మహిళ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పారు.

  • Published Mar 15, 2024 | 9:19 AMUpdated Mar 15, 2024 | 9:19 AM
మహిళలకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. రూ.10 లక్షల ఇన్సూరెన్స్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టేక ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో శరవేగంగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే రాష్ట్రంలో మహిళల కోసం మహాలక్ష్మీ పథకం కింద ఉచిత ఫ్రీ బస్సు సదుపాయాన్ని కల్పించిన విషయం తెలిసింది. దీంతోపాటు మహిళ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని సర్కార్ హామి ఇచ్చారు. అయితే తాజాగా ఈ విషయం పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిళల సంఘాలకు అదిరపోయే గుడ్ న్యూస్ ను చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో మహిళలందరికి మంచి గడియాలు రాబోతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళల సంఘాలకు మరో చక్కటి శుభవార్తను అందించారు. ఇక నుంచి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా, స్వయం సహాయక సంఘాలకు రుణ బీమా కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.దీనితో పాటు సర్కార్ రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు రూ.2 లక్షల వరకు తీసుకునే రుణాలకు ఇన్సూరెన్స్ కోసం.. స్త్రీనిధి సమాఖ్యకు రూ.50.41 కోట్లు విడుదల చేసింది. అయితే రాష్ట్రంలోని ఇక నుంచి మహిళలను కోటీశ్వరులు చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఈనెల 12న మహిళలకు వడ్డీలేని రుణాలు అందించే పథకానికి ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే 6.10 లక్షల స్వయం సహాయక సంఘాలు రుణాలు ఇవ్వాలని నిర్ణయించమని తెలిపారు. అలాగే రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని పేర్కొన్నారు. ఈ రుణాలకు ఈ ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. కాగా, గత 10 సంవత్సరాలుగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందలేదు అని గుర్తు చేయడంతో పాటు.. ప్రతి నిర్ణయంలో మహిళల భాగస్వామ్యం ఉండాలని మా ప్రభుత్వం భావిస్తోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అలాగే మీ కష్టం , మీ నైపుణ్యం , మీ ఉత్పత్తులను చూసిన, మీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. మీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన వంద షాపులను కట్టించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా మీ వస్తువుల విక్రయానికి అవకాశం కల్పిస్తాం. రాష్ట్రంలోని మహిళా సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులున్నారు. రానున్న రోజుల్లో కోటి మంది మహిళలు చేరాలి. కోటి మందిని కోటీశ్వరులను చేస్తే మన రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని రేవంత్ అన్నారు. ఇక ఆడబిడ్డలకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చామని రేవంత్ గుర్తుచేశారు.  ఈ క్రమంలోనే.. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించి.. గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు  ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని ఇందరమ్మ ఇండ్లు, వారి కన్నీళ్లు తుడవాలని రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. ఇక వచ్చే ఐదేళ్లలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందరమ్మ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అలాగే మా సైన్యం మీరే, మా బలగం మీరే, రాబోయే రోజుల్లో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు నిర్వహిస్తాం అని సీఎం రేవంత్ వెల్లడించారు. మరి, మహిళలకోసం సీఎం రేంవత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.