iDreamPost
android-app
ios-app

కంటైనర్‌లో ఊపిరాడక 16 ఎద్దులు మృతి.. అక్రమ రవాణా గుట్టు రట్టు!

  • Published May 30, 2024 | 10:36 AM Updated Updated May 30, 2024 | 10:36 AM

ఈ మధ్య కాలంలో చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న యావతో ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. డ్రగ్స్ అమ్మకాలు, స్మగ్లింగ్, మూగ జీవాల అక్రమ రావాణా ఇలా ఎన్నో దందాలకు పాల్పపడుతున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న యావతో ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. డ్రగ్స్ అమ్మకాలు, స్మగ్లింగ్, మూగ జీవాల అక్రమ రావాణా ఇలా ఎన్నో దందాలకు పాల్పపడుతున్నారు.

  • Published May 30, 2024 | 10:36 AMUpdated May 30, 2024 | 10:36 AM
కంటైనర్‌లో ఊపిరాడక 16 ఎద్దులు మృతి.. అక్రమ రవాణా గుట్టు రట్టు!

ఈ మధ్య కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడతున్నారు.పేదరికంలో ఉంటూ తాము కోరుకున్న లగ్జరీ జీవితం గడిపేందుకు యుత్ తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే యావలో మోసాలకు తెగబడుతున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ అమ్మకం, కిడ్నాపులు, బెదిరింపు, అక్రమ రవాణా ఇలా ఎన్నో రకాల దందాలకు పాల్పపడుతున్నారు. మూగ జీవాలను అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు దండుకుంటున్న ముఠాలు దేశంలో ఎన్నో తయారయ్యాయి. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నా.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.తాజాగా అక్రమ రవాణా గుట్టు విప్పారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కొంతమంది కేటుగాళ్లు బంగారం, వజ్రాలే కాదు.. మూగ జీవాలను అక్రమంగా రవాణా చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. తమ స్వలాభం కోసం వందల మూగ జీవాలను పొట్టనబెట్టుకుంటున్నారు. తాజాగా అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న నలుగురు తమిళనాడు వాసులను సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకొని.. కంటైనర్ లో ఏం తరలిస్తున్నారని ప్రశ్నించారు. దాంతో ఆ కేటుగాళ్లు ఇచ్చిన సమాధానం పోలీసులకు అనుమానం కలిగించింది. వెంటనే కంటైనర్ తెరిచి చూడగా ఒక్కసారే షాక్ తిన్నారు. కంటైనర్ లో ఎద్దులను తరలిస్తున్నారు. కంటైనర్లో 26 ఎద్దులు తరలిస్తుండగా 16 ఎద్దులు ఊపిరి ఆడక చనిపోయిన్లు పోలీసులు గుర్తించారు. మరణించిన ఎద్దులను పశు వైద్యులు పోస్టుమార్టం నిర్వహంచారు. ఈ ముఠాను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

పశు అక్రమ రవాణా దందా తొలిసారి కాదు.. కొన్నేళ్లుగా కేటుగాళ్లు రాత్రి వేళల్లో పశువులను యథేచ్చగా అక్రమంగా తరలిస్తున్నారు అక్రమార్కులు.  కంటైనర్లలో పరిమితికి మించి పశువులను ఎక్కిస్తూ ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఎండా కాలం కావడంతో ఒకేసారి కంటైనర్లో అన్ని పశువులు తరలించడంతో ఊపిరి ఆడక 16 ఎద్దులు చనిపోయినట్లు పశువైద్యులు తెలిపారు.  పోలీసులు ఎన్నోసార్లు అక్రమ రవాణా గుట్టు విప్పుతున్నా.. సైలెంట్ గా కొంతమంది తమ పని కానిచ్చేస్తున్నారు. వేల సంఖ్యల్లో పశువులను కబేళాలకు తరలిస్తూ కోట్లు దండుకుంటున్నారు.