ఇక చాలు ఆపేయండి.. సినీ నటులకు కాంగ్రెస్ స్ట్రాంగ్ వార్నింగ్..!

Congress Warning Trolling on Konda Surekha: మంత్రి కొండా సురేఖ.. అక్కినేని సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై వరుసగా సెలబ్రెటీలు ట్వీట్స్ చేస్తూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

Congress Warning Trolling on Konda Surekha: మంత్రి కొండా సురేఖ.. అక్కినేని సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై వరుసగా సెలబ్రెటీలు ట్వీట్స్ చేస్తూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్ పై విమర్శలు చేస్తున్న క్రమంలో అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయాల్లో దుమారం రేపాయి. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ సినీ పరిశ్రమ మొత్తం ఏకమైంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అని అంటున్నారు. రాజకీయ విషయాల్లో సినిమా వాళ్లను ఎందుకు లాగుతారు అంటూ తీవ్రంగా విమర్శించారు. కొండా సురేఖపై వరుసగా ట్రోలింగ్స్, విమర్శలు రావడంతో దీనికి ముగింపు పలికేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. ఈ విషయంపై కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునితా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్లే నాగ చైతన్య, సమంత లు విడాకులు తీసుకున్నారని మీడియా వేదికగా ఆరోపించారు కొండా సురేఖ. ఈ వ్యాఖ్యలను కేటీఆర్‌తో పాటు.. సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఆమె వ్యాఖలను వెనక్కి తీసుకోవాలని సెలబ్రెటీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సమంతకు క్షమాపణలు చెప్పారు. అయినా కూడా కొండా సురేఖపై వరుసగా ట్రోల్స్.. విమర్శలు రావడంతో కాంగ్రెస్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ క్రమంలోనే టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

సునీతా రావు మాట్లాడుతూ.. ‘వ్యక్తిగతంగా సినీ ప్రముఖల పేర్లు తీసుకురావడం మంత్రి కొండా సురేఖ చేసిందే తప్పే.  ఆమె తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పింది. కానీ, కొంతమంది ట్విట్టర్ వేదికగా మంత్రి కొండా సురేకపై దారుణమైన ట్రోటింగ్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్స్ చేయిస్తుంది కేటీఆర్ అన్న విషయం మాకు తెలుసు. వెంటనే ట్రోలింగ్స్ ఆపకుంటే ఈ అంశాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంటుంది. గాంధీ భవన్ సాక్షిగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం. కేటీఆర్ కి చెప్పుదెబ్బలు తప్పవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పెద్దలు అర్ధం చేసుకొని ఈ అంశానికి పులిస్టాప్ పెట్టాలి’ అని కోరారు.  ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సినీ రంగానికి చెందిన సెలబ్రెటీలకు కీలక విజ్ఞప్తి చేశారు. సినీ నటిపై తమ మంత్రి చేసిన వ్యాఖ్యలు విచారకరమని, ఆమె తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయాలని కోరారు.

Show comments