Dharmapuri Srinivas: కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత!

Dharmapuri Srinivas passed away: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన.

Dharmapuri Srinivas passed away: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన.

కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత  కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారు జామున 3 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో పదవులు చేపట్టారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 1948లో సెప్టెంబర్ 27న జన్మించిన ఆయన.. నిజాం కాళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో అటువైపు మళ్లారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. గెలిచారు. 1999, 2004లో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన డీఎస్ అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా సేవలు అందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో భారాసాలో చేరిన ఆయన.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ భాజాపా తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉండగా.. పెద్ద కొడుకు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. డీఎస్ మరణవార్త తెలియడంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నారు.

Show comments