ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసింది. 45 మందితో కూడిన జాబితాను రిలీజ్ చేయగా.. మళ్లీ ముఖ్యనేతలకు మెుండిచేయే ఎదురైంది. మరి ఎవరెవరికి సీట్లు కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసింది. 45 మందితో కూడిన జాబితాను రిలీజ్ చేయగా.. మళ్లీ ముఖ్యనేతలకు మెుండిచేయే ఎదురైంది. మరి ఎవరెవరికి సీట్లు కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో.. ఒక్కోపార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తూ.. వస్తోంది. అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించి.. ప్రతిపక్ష పార్టీలను ఇరకాటంలో పడేసింది. అదీకాక ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే వరుస సభల ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇంకా సీట్ల పంపకాల దగ్గరే ఆగిపోయాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్ తాజాగా విడుదల చేసింది అధిష్టానం. తొలి విడతలో 55 మందితో జాబితాను రిలీజ్ చేసిన ఢిల్లీ అధిష్టానం.. రెండో లిస్ట్ లో 45 మందితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. మరి ఎవరెవరికి సీట్లు దక్కాయో ఇప్పుడు తెలుసుకుందాం.
45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దీంతో తొలి లిస్ట్ తో కలిపి అభ్యర్థుల సంఖ్య 100కు చేరుకుంది. ఇంకా 19 స్థానాలను పెండింగ్ లో ఉంచింది ఢిల్లీ అధిష్టానం. ఇదిలా ఉండగా.. గద్దర్ కుమార్తె జీవీ వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును కేటాయించింది. మిగతా సీనియర్ నాయకులకు సంబంధించి.. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ను కేటాయించింది. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాలేరు, తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం టికెట్లను కేటాయించారు. మిగతా అభ్యర్థులకు ఏఏ నియోజకవర్గాలను కేటాయించారో చూద్దాం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసిసి విడుదల చేసిన అభ్యర్థుల జాబితా – 2023 pic.twitter.com/WZp1cj3s2M
— Telangana Congress (@INCTelangana) October 27, 2023