iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ నేత మధుయాష్కీకి తప్పిన ప్రమాదం..ఏం జరిగిందంటే?

  • Published May 06, 2024 | 2:34 PM Updated Updated May 06, 2024 | 2:34 PM

Madhu Yashki Goud Issue: ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ నేతలు ముమ్మర ప్రచారాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Madhu Yashki Goud Issue: ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ నేతలు ముమ్మర ప్రచారాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాంగ్రెస్ నేత మధుయాష్కీకి తప్పిన ప్రమాదం..ఏం జరిగిందంటే?

ఇటీవల దేశంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేసే తప్పిదాలు, టైర్లు పేలిపోవడం, సాంకేతిక లోపం అగ్ని ప్రమాదానికి గురి కావడం ఇలా ఎన్నో రకాలుగా ప్రమాదాలు జరుగుతన్నాయి. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నేతలుకు రోడ్డు ప్రమాదాలు జరడం తీవ్రంగా గాయపడటం చూస్తూనే ఉన్నాం.చాలా వరకు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, అతి వేగం ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆయనకు ఏం జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కికి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. మాజీ ఎంపీ బలరాం నాయక్ తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి మధు యాష్కీ వరంగల్ కి బయలుదేరారు.. యాదాద్రి జిల్లా ఆలేరు వద్దకు రాగానే బైక్ పై ఇద్దరు వ్యక్తులు రాంగ్ రూట్ లో ఎదురుగా వచ్చారు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు తప్పించే ప్రయత్నంలో డివైడర్ ని ఢీ కొట్టాడు. దీంతో కారు రెండు టైర్లు పేలిపోయాయి. దీంతో మధు యాష్కితో సహ కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.

ఈ సందర్భంగా మధు యాష్కీ ‘ఆలేరు సమీపంలో నా కారు ప్రమాదానికి గురైంది.. ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు అడ్డుగా రాంగ్ రూట్ లో అడ్డుగా వచ్చారు.. అది గమనించిన నా డ్రైవర్ ముఖేష్ వెంటనే వారిని రక్షించేందుకు కారును పక్కకు తప్పించడం.. అది డివైడర్ కి ఢీ కొట్టడం జరిగింది. దేవుడి దయ వల్ల ఎవరికీ ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు. డ్రైవర్ ముఖేష్ తెలివిగా ప్రవర్తించడం వల్ల పెను ప్రమాదం తప్పిపోయింది’ అని ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.