iDreamPost
android-app
ios-app

ప్యారడైజ్ హోటళ్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. నిబంధనల ప్రకారమే ఉందంటూ..!

Food Safety Raids In Paradise: హైదరాబాద్ నగరం అంతటా రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా రెస్టారెంట్లలో నిబంధనలు పాటించడం లేదని తేలింది. తాజాగా ప్యారడైజ్ లో కూడా అధికారులు తనిఖీలు చేశారు.

Food Safety Raids In Paradise: హైదరాబాద్ నగరం అంతటా రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా రెస్టారెంట్లలో నిబంధనలు పాటించడం లేదని తేలింది. తాజాగా ప్యారడైజ్ లో కూడా అధికారులు తనిఖీలు చేశారు.

ప్యారడైజ్ హోటళ్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. నిబంధనల ప్రకారమే ఉందంటూ..!

ప్రస్తుతం భాగ్యనగరం మొత్తం ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని నిబంధనలు పాటిస్తున్నారా? ఆహార పదార్థాలను సుచిగా వండుతున్నారు. వంటశాలలు శుభ్రంగానే ఉంటున్నాయా? ముడి సరుకులు నాణ్యమైనవి, సర్టిఫైడ్ వస్తువులే వాడుతున్నారా? తాగునీరు, పరిసరాలు, కిచెన్ అన్ని సవ్యంగా ఉంటున్నాయా? ఇలా చాలానే కోణాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సోదాల్లో చాలా వరకు పేరు మోసిన రెస్టారెంట్లు డొల్ల అని తేలిపోయింది. ఎక్స్ పైర్ అయిన ముడి పదార్థాలు వాడుతున్నారని, కిచెన్ శుభ్రంగా లేదని తేలిపోయింది. ఇలాంటి తరుణంలో అధికారులు మాసబ్ ట్యాంక్  ఏరియా ప్యారడైజ్ రెస్టారెంట్ లో కూడా సోదాలు నిర్వహించారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో బయటకు వెళ్లి ఏదైనా తినాలి అంటే మనసు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం ఇన్ని రోజులు బెస్ట్ రెస్టారెంట్లు, ఫేమస్ రెస్టారెంట్లు అనుకున్నవి అన్నీ ఎంత సుచిగా, శుభ్రంగా ఉంటున్నాయో? ఎలాంటి వస్తువులను వాడుతున్నారో చూశాం. వచ్చే కస్టమర్ ఆరోగ్యం మీద వారికి కనీసం శ్రద్ధ లేదు అని తేలిపోయింది. చాలా వరకు అన్ని రెస్టారెంట్ల పరిస్థితి ఇలాగే ఉంది. ముఖ్యంగా కిచెన్ పరిసరాల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అక్కడి సీన్స్ ఒకసారి చూస్తే జీవితంలో మళ్లీ అక్కడ భోజనం చేయరు. అంత ఘోరంగా ఉన్నాయి. ముఖ్యంగా డేట్ అయిపోయిన, పాడైన వస్తువులతో రుచికరమైన వంటలు చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో వరల్డ్ ఫేమస్ ప్యారడైజ్ లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెక్ చేశారు. ప్యారడైజ్ ఫుడ్ కోర్టులో అన్నీ సవ్యంగానే ఉన్నాయని తేల్చారు. నింబధనలకు అనుగుణంగానే అన్నీ ఉన్నాయన్నారు. బిల్ కౌంటర్లో FSSAI లైసెన్స్ ఒరిజినల్ కాపీని డిస్ ప్లే చేశారని చెప్పారు. అలాగే ఎవరైతే ఆహారాన్ని తయారు చేస్తారో, ఎవరు సర్వ్ చేస్తోరా వాళ్లంతా చేతికి గ్లౌజులు, తలకు హెయిర్ క్యాప్స్ ధరించి ఉన్నారన్నారు. మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ లో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయన్నారు. ముడి పదార్థాలు, సెమీ ప్రిపేర్డ్ పదార్థాలే కాకుండా.. తయారు చేసిన ఆహార పదార్థాలు కూడా కవర్ చేసే ఉన్నాయన్నారు.

ప్యారడైజ్ లో అందిస్తున్న మంచినీటిని కూడా టెస్ట్ చేశారు. టీడీఎస్ మీటర్లో అక్కడి మంచినీళ్లు 73 పీపీఎం చూపించిందన్నారు. టీడీఎస్ లెవల్స్ సరిగ్గానే ఉన్నాయి. వాటర్ బాటిల్స్ ను పరిశీలన కోసం ల్యాబ్ కు పంపారు. మొత్తానికి హైదరాబాద్ వాసులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా ఫేమస్ రెస్టారెంట్లు అన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయని తేలింది. ఇలాంటి తరుణంలో ఫుడ్ తినడానికి ఒక రెస్టారెంట్ ఉందని అధికారులు భరోసా కలిగించారు. చాలాచోట్ల నిబంధనలు పాటించకపోవడమే కాకుండా.. కుళ్లిన కూరగాయలు, పాడైన ఆహార పదార్థాలను గుర్తించారు. మరి.. ప్యారడైజ్ లో అంతా బాగానే ఉందని తేలడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.