Arjun Suravaram
Rain Alert In Telangana: ఉపరితల ద్రోణి ప్రభావంతో.. ఏపీ, తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే ఉదయం నుంచి వాన దంచి కొడుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Rain Alert In Telangana: ఉపరితల ద్రోణి ప్రభావంతో.. ఏపీ, తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే ఉదయం నుంచి వాన దంచి కొడుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Arjun Suravaram
బంగాళ ఖాతం లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతం రెండు తెలుగు రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. ఇదే సమయంలో శనివారం ఏపీ, తెలంగాణలో కుండపోత వాన కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే శనివారం ఉదయం నుంచి ఓ మోస్తారు వాన గ్యాప్ ఇవ్వకుండా పడింది. ఇప్పటికే కురిసిన వానలకు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీనిని నుంచే కోలుకోక ముందే ప్రజలకు వాతావరణ శాఖ మరో భారీ అలెర్ట్ ను ఇచ్చింది. అంతేకాక ఈ అలెర్ట్ ప్రజలకు తీవ్రమైన హెచ్చరిక అని చెప్పొచ్చు. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళ ఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసింది. శుక్రవారం వరకు తీవ్ర అల్ప పీడనం కాస్తా వాయుగుండా మారింది. ఈ కారణంతో శనివారం రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావం కారణంగా రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ కురుస్తాయని చెప్పారు. మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వానలు పడతాయని వివరించారు. అనంతరం వాయుగుండం బలహీనపడి తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
శనివారం, ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి , భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం,నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, గద్వాల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అల్టర్ జారీ చేసింది. మిగత జిల్లాల్లో కూడా భారీ వానలు పడతాయని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంది.
భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలు అవసరమైతెనే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కురిసిన వానలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వానలకు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీరు వెళ్లే మార్గం లేక పలు చోట్ల రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. వానలు పడుతున్నందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. విద్యార్థులు, ఉద్యోగులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.