Krishna Kowshik
హైదరాబాద్ అంటే చార్మినార్ తర్వాత.. అంతే ఫేమస్ బిర్యానీ. నగర వ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్స్ లో కూడా దొరికేస్తుంది బిర్యానీ. అయితే మటన్, చికెన్ బిర్యానీ తిందామని వెళుతున్న వారికి..
హైదరాబాద్ అంటే చార్మినార్ తర్వాత.. అంతే ఫేమస్ బిర్యానీ. నగర వ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్స్ లో కూడా దొరికేస్తుంది బిర్యానీ. అయితే మటన్, చికెన్ బిర్యానీ తిందామని వెళుతున్న వారికి..
Krishna Kowshik
బిర్యానీ అంటే హైదరాబాద్ వాసులకు ఓ ఎమోషన్. అందుకే ఇక్కడ ఏ బిజినెస్ రన్ అవుతుందో లేదో తెలియదు కానీ.. ఫుడ్ బిజినెస్.. అందులోనూ బిర్యానీ రెస్టారెంట్, హోటల్స్, చివరకు స్ట్రీట్ ఫుడ్‌కు మంచి గిరాకి ఉంటుంది. వీకెండ్ వస్తే చాలు ఇక్కడ బిర్యానీ హోటల్స్ అన్నీ ఫుల్ రష్ అవుతుంటాయి. కస్టమర్లతో కళకళలాడుతుంటాయి. కానీ ఇదే అదునుగా తీసుకుని.. బిర్యానీ హోటల్స్ మాత్రం ఆహార నాణ్యతను గాలికి వదిలేస్తున్నాయి. అందుకే ఆహార కల్తీలో హైదరాబాద్ ఫస్ట్ ప్లేసులో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కొన్ని నెలల క్రితం సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో ఇద్దరు యువకులు మటన్ కీమా, రోటీ తిని అస్వస్థతకు గురైన సంగతి విదితమే.
మొన్నటికి మొన్న బావర్చి నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే.. బల్లి వచ్చిందని అంబర్ పేటకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు . గబ్బిబౌలిలో కూడా ఓ హోటల్లో బొద్దింక వచ్చిందంటూ.. కంప్లయింట్ ఇచ్చాడు. తాజాగా మరో హోటల్ నిర్వాకం బయటకు వచ్చింది. హైదరాబాద్ కర్మన్ ఘాట్ లోని ఈస్ట్ కోర్టు రెస్టారెంట్లో బిర్యానీ తినేందుకు వెళ్లిన రఘ అనే వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని సగం తిన్నాక.. అందులో బొద్దింక కనిపించడంతో అవాక్కయ్యాడు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బందిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో..రఘ వెంటనే జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, ఫుడ్ సేఫ్టీ అధికారులు.. హోటల్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేవలం చిన్న చిన్న హోటల్లోనే కాదూ.. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఆహార నాణ్యతలో లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఏదో ఒక జీవాలు బయటపడటం.. అవి తిని కస్టమర్లు అస్వస్థతకు గురికావడం జరుగుతున్నాయి. పోనీ ఫుడ్ మానేస్తారా అంటే.. అదీ సాధ్యం కావడం లేదు జనాలకు. మంచి టేస్టీ అండ్ వెరైటీ బిర్యానీలు దొరకడంతో పాటు.. తక్కువ ధరకు లభించడంతో బిర్యానీ కోసం కిలోమీటర్లు దూరం కూడా ప్రయాణించి.. ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. అందుకే రెస్టారెంట్స్, హోటల్స్ కూడా తమ ఇష్టమొచ్చినట్లు వడ్డి, వారుస్తున్నాయి కస్టమర్లకు .