P Krishna
Good News for Telangana Farmers: తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రైతులకు ఓ శుభవార్తల అందించారు.
Good News for Telangana Farmers: తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రైతులకు ఓ శుభవార్తల అందించారు.
P Krishna
గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలపై హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో రెండు గ్యారెంటీలు ప్రారంభించారు. రైతు సంక్షేమం గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త తెలిపింది. ఇంతకీ ఆ శుభవార్త ఏంటీ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
రైతుల రుణమాఫీ పథకం విధి విధానాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం (మే16) అధికారులతో చర్చించారు. ఖరీఫ్ 2024 నుంచి అమలు అయ్యే పంటల భీమా విధి విధానాలపై దిశా నిర్దేశం చేశారు. టెండర్లలో నిబంధనలకు అంగీకరించి ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతల విషయంలో పూర్తిగా పరిశీలించి.. రైతులు పంట నష్టపోయిన సందర్భంలో ఈ బీమా పథకం వారిని ఆదుకొనే విధంగా ఉండాలని మంత్రి తెలిపారు. ఈ పథకం అమలు విషయంలో అదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మీటింగ్స్ నిర్వహించి రైతుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మంత్రి తెలిపారు.
ఈ క్రమంలోనే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై సరఫరాకు విధి విధానాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా సరఫరా ప్రారంభించాలని తెలిపారు. సరఫరాలో ఎక్కడ కూడా లోటు పాట్లు ఉండకుండా చూసుకోవాలని ఆదేశించారు. మొదటి విడత పంట నష్ట పరిహారం రూ.15 కోట్లు పంపిణీ పూర్తయ్యిందని, ఏప్రిలో లో రెండో విడత, మేలో మూడో విడత పంట నష్ట వివరాలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు. మట్టి నమూనా పరిక్షా కేంద్రాల సామర్థ్యం అనుసరించి.. రైతుల పొలాల మట్టి నమూనాలు సేకరించి ఫలితాలు వచ్చే నెల చివర్లో అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. వరి కొయ్యలు కాల్చకుండా రైతుల కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని.. ఒక వేళ వినకపోతే సంబంధితన అధికారులతో సమన్వయం చేసుకుంటూ వరి కొయ్యలు తగలపెడితే జరిమానా విధించాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మార్కె ఫెడ్ ద్వారా జొన్న, పొద్దుతిరుగుడు, మొక్క జొన్న కొనుగోళ్ళను వేగవంతం చేయాలని.. ఈ నెల చివర్లో పూర్తి చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు.