iDreamPost
android-app
ios-app

MLA లాస్య నందిత భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించిన CM రేవంత్!

CM Revanth, MLA Lasya Nanditha: శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. లాస్య నందిత నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఆమె భౌతికకాయానికి నివాళ్లులర్పించారు.

CM Revanth, MLA Lasya Nanditha: శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. లాస్య నందిత నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఆమె భౌతికకాయానికి నివాళ్లులర్పించారు.

MLA లాస్య నందిత భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించిన CM రేవంత్!

శుక్రవారం ఉదయం కంటోన్మెంట్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె.. అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు..ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి అనంతరం డివైడర్‌ను ఢీ కొట్టింది. ఇక ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత మరణించగా.. కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. లాస్య నందిత నివాసానికి వెళ్లి.. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక‌కాయానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. నందిత కుటుంబ స‌భ్యుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్, శ్రీధ‌ర్‌బాబుతో పాటు ప‌లువురు నందిత నివాసానికి చేరుకుని ఆమెకు నివాళుల‌ర్పించారు. ఆమె భౌతికకాయాన్ని చూసేందుకు బీఆర్ఎస్ నాయ‌కులు భారీగా చేరుకున్నారు. నందిత అంత్యక్రియలు మారేడుపల్లిలోని శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. లాస్య నందిత పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించారు. ఆమె కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. అలానే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు నందిత పార్థివదేహానికి నివాళ్లు అర్పించారు. ఇక ఆమె మృతితో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు  తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

శుక్రవారం ఉదయం పటాన్ చెరువు  సమీపంలోని ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ లాస్య నందిత మృతి చెందారు. సదాశివపేటలో జరిగిన ఓ వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. పదిరోజుల క్రితమే నల్గొండ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తుండగా.. ఈమె కారు ప్రమాదానికి గురైంది. ఆ సంఘటనలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆమెను మృత్యువ మరోసారి వెంటాడింది.

సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో ఆమె ఆక్కడిక్కడే మృతి చెందడం బీఆర్ఎస్ నేతలు షాక్ కి గురయ్యారు. గత ఏడాది ఇదే ఫిబ్రవరి 19న ఆమె తండ్రి సాయన్న గుండెపోటుతో కన్నుమూశారు. మూడు రోజుల క్రితమే ఆయన తండ్రి వర్థంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆ కార్యక్రమం నిర్వహించిన మూడు రోజులకే ఈ ఘోరం చోటుచేసుకుంది. చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె రాజకీయంగా ఎంతో భవిష్యత్ ఉందని భావించిన తరుణంలో ఇలా మృత్యు ఒడికి చేరడంతో కుటుంబంలో, బీఆర్ఎస్  పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.