CM రేవంత్ కీలక ప్రకటన.. నిరుద్యోగులు- రైతులకు శుభవార్త!

CM Revanth On New Jobs: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో శుభవార్త అందజేశారు. అలాగే రైతులకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth On New Jobs: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో శుభవార్త అందజేశారు. అలాగే రైతులకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులు, రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల స్ఫూర్తితోనే ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకెళ్తున్నామన్నారు. ఫిబ్రవరి 27న ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. అలాగే ఆ పథకాలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించిబోతున్న విషయాన్ని వెల్లడించారు. అలాగే నిరుద్యోగులు, రైతులకు కూడా ఒక శుభవార్తను అందించారు.

మేడారం సమ్మక్క సారలమ్మలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవార్లకు సీఎం రేవంత్ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర కోసం ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. జాతరకు మహాలక్ష్మి పథకంలోని ఉచిత ప్రయాణం ద్వారా 18 కోట్ల మంది మహిళలు జాతరకు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ ఈ నెల 27 నుంచే రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ హామీలను అమలు చేయబోతున్న విషయాన్ని రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ హామీల ప్రారంభోత్సవానికి ప్రియాంక గాంధీ వస్తారనే విషయాన్ని వెల్లడించారు. సమ్మక్క- సారలమ్మ ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రూపుదిద్దుకుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగానే నిరుద్యోగులు, రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 2వ తేదీన 6 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామంటూ ప్రకటించారు. ఈ వార్త విన్న తర్వాత నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే రైతులకు సంబంధించిన రూ.2 లక్షల రుణమాఫీపై కూడా అతి త్వరలోనే శుభవార్త అందించబోతున్న విషయాన్ని వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరి 6న అమ్మవారి ఆశీస్సులతోనే హాత్ సే హాత్ జోడోయాత్ర ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. అమ్మల దీవెనలతోనే తమకు ఈ పదవులు వచ్చాయంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమని నమ్ముకున్న ప్రజల కోసం సమ్మక్క- సారలమ్మలు అమరులయ్యారంటూ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అమ్మవార్ల స్ఫూర్తితోనే ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా తాము ముందుకెళ్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు, రైతులకు శుభవార్తలు అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments