Dharani
Indiramma Indlu Scheme
Indiramma Indlu Scheme
Dharani
ప్రతి మనిషి జీవితంలో ఉండే అతి సామాన్యమైన, ముఖ్యమైన కోరిక ఏంటంటే.. సొంతింటి నిర్మాణం. తాను చనిపోయే లోపే.. తనకు మాత్రమే సొంతమైన ఓ గూడులో హాయిగా.. ప్రశాంతంగా కన్ను మూయాలని కోరుకుంటాడు. అయితే నేటి కాలంలో ఇంటి నిర్మాణం అనేది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. పల్లెటూళ్లల్లో ఇల్లు కట్టాలంటేనే తక్కువలో తక్కువ పది లక్షల రూపాయల వరకు అవుతోంది. అదే పట్టణాల్లో అయితే ఈ ఖర్చు ఐదారింతలు పెరుగుతుంది. అంటే నగరాల్లో సొంతిల్లు కొనాలన్నా.. కట్టాలన్నా.. ఎంతలేదన్న అర కోటి వరకు ఖర్చు చేయాల్సిందే. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలందరికి సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో హౌసింగ్ స్కీమ్స్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం.. సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఆ వివరాలు..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలకు కట్టుబడి ఉంది. ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేయగా.. మిగతా వాటి అమలు కోసం రెడీ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే మ్యాగ్జిమం గ్యారెంటీలను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో నేడు అనగా మార్చి 11న మరో కీలక హామీని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేదలు సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకుగాను వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించిన ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకానికి నేడు భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనుంది.
అర్హులైన.. ఇళ్లు లేని నిరుపేదలందరికీ దశల వారిగా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీని కింద స్థలం ఉన్న వారికి.. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేయనున్నారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షలు సాయాన్ని కూడా అందిస్తారు. తొలి విడతలతో అన్ని నియోజకవర్గాల నుంచి 90 వేల పైచిలుకు లబ్ధిదారులను గుర్తించారు.