iDreamPost
android-app
ios-app

ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలు.. నేడే ప్రారంభం.. వారికి మాత్రమే

  • Published Mar 11, 2024 | 1:44 PM Updated Updated Mar 11, 2024 | 9:12 PM

Indiramma Indlu Scheme

Indiramma Indlu Scheme

  • Published Mar 11, 2024 | 1:44 PMUpdated Mar 11, 2024 | 9:12 PM
ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలు.. నేడే ప్రారంభం.. వారికి మాత్రమే

ప్రతి మనిషి జీవితంలో ఉండే అతి సామాన్యమైన, ముఖ్యమైన కోరిక ఏంటంటే.. సొంతింటి నిర్మాణం. తాను చనిపోయే లోపే.. తనకు మాత్రమే సొంతమైన ఓ గూడులో హాయిగా.. ప్రశాంతంగా కన్ను మూయాలని కోరుకుంటాడు. అయితే నేటి కాలంలో ఇంటి నిర్మాణం అనేది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. పల్లెటూళ్లల్లో ఇల్లు కట్టాలంటేనే తక్కువలో తక్కువ పది లక్షల రూపాయల వరకు అవుతోంది. అదే పట్టణాల్లో అయితే ఈ ఖర్చు ఐదారింతలు పెరుగుతుంది. అంటే నగరాల్లో సొంతిల్లు కొనాలన్నా.. కట్టాలన్నా.. ఎంతలేదన్న అర కోటి వరకు ఖర్చు చేయాల్సిందే. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలందరికి సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో హౌసింగ్‌ స్కీమ్స్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం.. సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలకు కట్టుబడి ఉంది. ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేయగా.. మిగతా వాటి అమలు కోసం రెడీ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే మ్యాగ్జిమం గ్యారెంటీలను అమలు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ రెడీ అవుతోంది. ఈ క్రమంలో నేడు అనగా మార్చి 11న మరో కీలక హామీని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. పేదలు సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకుగాను వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించిన ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకానికి నేడు భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్‌. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనుంది.

అర్హులైన.. ఇళ్లు లేని నిరుపేదలందరికీ దశల వారిగా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. దీని కింద స్థలం ఉన్న వారికి.. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేయనున్నారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షలు సాయాన్ని కూడా అందిస్తారు. తొలి విడతలతో అన్ని నియోజకవర్గాల నుంచి 90 వేల పైచిలుకు లబ్ధిదారులను గుర్తించారు.

అర్హులు వీరే..

  • బీపీఎల్‌ కుటుంబాలకు చెందిన వారై ఉండాలి.
  • రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని ఎంపిక చేస్తారు.
  • లబ్ధిదారుడికి సొంతగా ఖాళీ స్థలం ఉండాలి.
  • లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి.
  • గుడిసె, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా వారు కూడా పథకానికి అర్హులవుతారు.
  • అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారులు కూడా అర్హులే.
  • పెళ్లి చేసుకున్నా.. లేదా ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా వారైనా సరే.. అర్హతలుంటే.. ఈ పథకానికి ఎంపిక చేస్తారు.
  • ఒంటరి, వితంతు మహిళలూ కూడా ఈ పథకానికి అర్హులే
  • లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధి వారై ఉండాలి.

లబ్దిదారుల ఎంపిక విధానం ఇలా..

  • ఇందిరమ్మ ఇంటిని అర్హులైన మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు.
  • గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తరవాతే లబ్ధిదారులను కలెక్టర్‌ సెలెక్ట్ చేస్తారు.
  • లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామసభలో ప్రదర్శించాక సమీక్షించిన తర్వాతే ఫైనల్‌ చేస్తారు
  • ఆ తర్వాత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్‌ ఇంటిని మంజూరు చేస్తారు.
  • జిల్లాల్లో కలెక్టర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌లో కమిషనర్‌ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయి.
  • 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్‌, బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి. ఆర్‌సీసీ రూఫ్‌తో ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది.

డబ్బు మంజూరు ఎలా చేస్తారంటే..

  • ఈ పథకానికి అర్హులైన వారికి
  • దశల వారీగా ఇంటి నిర్మాణానికి డబ్బులు మంజూరు
  • మెుదటగా బేస్‌మెంట్‌ స్థాయిలో రూ.లక్ష మంజూరు చేస్తారు.
  • ఆ తర్వాత పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో మరో రూ.లక్ష ఇస్తారు.
  • పైకప్పు నిర్మాణం పూర్తయిన తరవాత రూ.2 లక్షలు మంజూరు చేస్తారు.
  • ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష. ఇలా మొత్తం 5 లక్షలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.