iDreamPost
android-app
ios-app

Revanth Reddy: సింగరేణి ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఒక్కొక్కరికి రూ. కోటి వరకు

  • Published Feb 27, 2024 | 8:01 AM Updated Updated Feb 27, 2024 | 8:01 AM

సింగరేణి ఉద్యోగులకు సంబంధించి రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల వారికి ఒక్కొక్కరికి రూ. కోటి వరకు లబ్ధి చేకూరనుంది. ఆ వివరాలు..

సింగరేణి ఉద్యోగులకు సంబంధించి రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల వారికి ఒక్కొక్కరికి రూ. కోటి వరకు లబ్ధి చేకూరనుంది. ఆ వివరాలు..

  • Published Feb 27, 2024 | 8:01 AMUpdated Feb 27, 2024 | 8:01 AM
Revanth Reddy: సింగరేణి ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఒక్కొక్కరికి రూ. కోటి వరకు

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేస్తోన్న రేవంత్‌ సర్కార్‌.. మార్చి నాటికి.. అన్నీ గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. అలానే ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలను కూడా నెరవేర్చేందుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో సింగరేణి ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వారు ఒక్కొక్కరికి కోటి రూపాయల లబ్ధి చేకూరనుంది. ఆ వివరాలు..

సింగ‌రేణి ఉద్యోగుల‌కు రేవంత్ సర్కార్ తీపి క‌బురు వినిపించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వారి కోసం కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు సింగరేణి ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌ ఆ మొత్తాన్ని రూ. కోటికి పెంచింది. అలానే.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రమాద బీమాను కూడా 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 43 వేల మంది కార్మికులకు ఈ కోటి రూపాయల ప్రమాద బీమా పథకం వర్తించనుంది. అయితే.. ఇప్పటి వరకు కేవలం సైనికులకు మాత్రమే ప్రమాద బీమా కోటి రూపాయలు ఉండగా.. ఇక నుంచి సింగరేణి కార్మికులకు కూడా వర్తించనుంది.

ఈ మేరకు బ్యాంకర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం నాడు హైదరాబాద్ సచివాలయంల బ్యాంకర్లతో సమావేశం అయ్యారు. సింగరేణి సంస్థ ఉద్యోగుల ప్రమాద బీమా పథకంపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో.. అకౌంట్ కలిగిన సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అంగీకరించారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందినా లేదా.. శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది అందరికీ కూడా ఈ ప్రమాద బీమా పథకం వర్తించనుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సింగరేణి కార్మిక లోకానికి ఇది చారిత్రాత్మక రోజని అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిది అన్నారు. సంస్థ విషయంలో గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పుకొచ్చారు. గత పదేళ్లలో సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్లలో సంస్థ నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేసింది. మరోవైపు.. గత ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు నెల చివర్లో చెల్లిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాలుగో తారీఖునే వారికి వేతనాలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. మరో 15 రోజుల్లోగా అందరికి రైతు బంధు చెల్లిస్తామని తెలిపారు.