Revanth Reddy: వరదల్లో ఇండ్లు కోల్పోయిన వారికి CM రేవంత్ హామీ.. వారికి భారీ ఊరట

Revanth Reddy-Indiramma Illu, Flood Victims: రెండు, మూడు రోజులుగా తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితులకు కీలక హామీ ఇచ్చారు. ఆ వివరాలు..

Revanth Reddy-Indiramma Illu, Flood Victims: రెండు, మూడు రోజులుగా తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితులకు కీలక హామీ ఇచ్చారు. ఆ వివరాలు..

తెలంగాణలో గత మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. వానల వల్ల పలు ప్రాంతాల్లో వరదలు పోటేత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదల వల్ల పలు ప్రాంతాల్లో రోడు, రవాణా వ్యవస్థ కొట్టుకుపోయి.. జన జీవనం స్తంభించిపోయంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలైన రాజీవ్ గృహకల్ప కాలనీ, ఎఫ్‌సీఐ రోడ్డు, బొక్కలగడ్డ కాలనీ, పెద్ద తండా తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శించారు.

వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం చేస్తామని.. పాడి పశువులు చనిపోతే రూ.50 వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5 వేలు ఇస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర హోం మంత్రికి వివరించామని, తక్షణమే నష్ట నివారణకు సహకరించాలని కోరామని చెప్పుకొచ్చారు. అంతేకాక తాత్కాలిక ఉపశమనంగా ప్రాథమిక అంచనా ప్రకారం కేంద్రాన్ని రూ.5,438 కోట్ల రూపాయాలు ఇవ్వాలని కోరామన్నారు.
జరిగిన నష్టాన్ని ప్రధాని స్వయంగా పరిశీలించాలని కోరినట్లు తెలిపారు. అంతేకాక రెస్క్యూ, రిపేర్, రిస్టోర్, రిపోర్టుతో జిల్లా యంత్రాంగం రాబోయే 5 రోజులూ కష్టపడి పనిచేయాలన్నారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
Show comments