Revanth Reddy-Free Electricity, Govt Schools: వారికి రేవంత్‌ సర్కార్‌ శుభవార్త.. కరెంట్‌ 200 యూనిట్లు దాటినా ఉచితమే

Revanth Reddy: వారికి రేవంత్‌ సర్కార్‌ శుభవార్త.. కరెంట్‌ 200 యూనిట్లు దాటినా ఉచితమే

Revanth Reddy-Free Electricity, Govt Schools: ఉచిత కరెంట్‌కు సంబంధించి రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Revanth Reddy-Free Electricity, Govt Schools: ఉచిత కరెంట్‌కు సంబంధించి రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని వరుసగా నెరవేరుస్తూ పోతుంది. మరీ ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుపై ప్రధానంగా దృష్టి సారించిన రేవంత్‌ సర్కార్‌.. ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌తో పాటు.. అతి ముఖ్యమైన 2 లక్షల రూపాయల రుణమాఫీ వంటి హామీలన్నింటిని నెరవేరుస్తుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడమే కాక.. ఆ తర్వాత కీలకమైన అంశాలకు సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ వివరాలు..

ఈ క్రమంలో తాజాగా రేవంత్‌ సర్కార్‌.. కొందరికి శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ అందిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉచిత కరెంట్‌కు సంబంధించి కాంగ్రెస్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సుదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. 200 యూనిట్లతో సంబంధం లేకుండా పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.

ఇటీవల పదోన్నతి పొందిన టీచర్ల ఆత్మీయ సమ్మెళనంలో సీఎం రేవంత్‌ పాల్గొని మాట్లాడుతూ దీనిపై కీలక ప్రకటన చేశారు. ఇక ప్రభుత్వ టీచర్లకు ఒకటో తేదీనే జీతాలు అందిస్తామని దానిని అమలు చేసే బాధ్యత తనదేనన్నారు. మెరుగైన విద్య, వైద్యం అందించడం వల్లనే ఢిల్లీలో కేజ్రీవాల్ వరుసగా మూడు సార్లు గెలుపొందినట్లు తెలిపారు. వీటిపైనే ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తుందన్నారు. ఇక రాష్ట్రంలో పాఠశాల విద్య రూపురేఖలు మార్చేందుకు రేవంత్‌ సర్కార్‌ కృషి చేస్తోంది. ప్రతి మండలానికి ఒక ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలతో పాటు.. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించి.. వారికి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తామని తెలిపారు.

ఆరు గ్యారెంటీల అమలకు రేవంత్‌ సర్కార్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అతి ముఖ్యమైన రైతు రుణమాఫీని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌ సర్కార్‌ ఇప్పటికే రెండు విడతల్లో లక్షన్నర వరకు రుణమాఫీ చేయగా.. ఇక ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Show comments