iDreamPost

నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 11 వేల ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

  • Published Jun 11, 2024 | 8:40 AMUpdated Jun 11, 2024 | 8:40 AM

CM Revanth Reddy: తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్‌ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే 11 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆ వివరాలు..

CM Revanth Reddy: తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్‌ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే 11 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆ వివరాలు..

  • Published Jun 11, 2024 | 8:40 AMUpdated Jun 11, 2024 | 8:40 AM
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 11 వేల ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో నిరుద్యోగ సమస్య ప్రధాన కారణం అని చెప్పవచ్చు. నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ.. వారిని తమ వైపు తిప్పుకునేందుకు భారీ ఎత్తున హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగాంగా తాము అధికారంలోకి రాగానే ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంమత్రి రేవంత్‌ రెడ్డి. దానిలో భాగంగా అధికారంలోకి రాగానే.. ముందుగా టీజీపీఎస్‌సీ బోర్డును రద్దు చేశారు. కొత్త సభ్యులతో నూతన బోర్డును ఏర్పాటు చేశారు. ఇక గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి కుదరలేదు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు కూడా వెలువడటంతో.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఈ క్రమంలో నిరుద్యోగులు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఆ వివరాలు..

నిరుద్యోగులకు సీఎం రేవంత్‌ రెడ్డి భారీ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. త్వరలోనే 11 వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాలు, తండాల్లో కొత్త పాఠశాలలను తెరిపించాలంటే పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల అవసరం ఉందన్నారు రేవంత్‌ రెడ్డి. అందుకోసమే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. దీనిలో భాగంగా త్వరలోనే 11 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా నడిచిందని.. సర్కారు పాఠశాలలను మూసివేసిందంటూ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. అంతేకాక ఒక్క టీచర్‌ ఉన్న పాఠశాలలను మూసేయటానికి వీల్లేదని అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.

Revanth Reddy

వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు.. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. మారుమూల గ్రామాలు, తండాల్లో ప్రభుత్వ పాఠశాలలను తెరుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సగటున రూ. 80 వేల చొప్పున ఖర్చుపెడుతుందని.. దీనిలో అధికశాతం టీచర్ల వేతనాలకే వెళ్తుందన్నారు. అయినా.. విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే ప్రక్రియలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రావడంలేదనే వాదనను దృష్టిలో పెట్టుకుని ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరుతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్లలను చేర్పించకపోతే పాఠశాల మూతబడుతుందనే అంశాన్ని తల్లిదండ్రులకు అర్థం చేయిస్తున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిస్తే తల్లిదండ్రులు కూడా పంపడానికి ఆసక్తి చూపుతారని అన్నారు. అలానే గ్రామీణ పాఠశాలలపై నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి