ధరణిపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ!

Dharani Portal: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ధరణి పోర్టల్ పై సమీక్ష సమావేశం నిర్వహించి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Dharani Portal: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ధరణి పోర్టల్ పై సమీక్ష సమావేశం నిర్వహించి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్క్ పరిపాలను చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే.. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చారు. అంతేకాక సామాన్యుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ ను కూడా ఏర్పాటు చేశారు. అలానే ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను తొలిగించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేలా.. చర్యలు తీసుకుంటున్నారు. అలానే గత ప్రభుత్వంలో కార్యక్రమాలపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా భూములకు సంబంధించిన ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం, పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ను ఆదేశించారు.

బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ధరణి కార్యక్రమంపై సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరణి కార్యక్రమంలో లోటు పాట్లపై వారం లేదా పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్‌కు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపర్చాలని సీఎం తెలిపారు. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అదే విధంగా ధరణి పోర్టల్ ద్వారా లావాదేవీలపై వస్తున్న విమర్శలకు ఒక డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.  గ్రామ సదస్సులు, రికార్డుల సవరణ ఎందుకు చేయలని  అధికారులను సీఎం ప్రశ్నించారు. భూములపై సమగ్ర సర్వే చేయడంపై అధికారులను సీఎం అడిగారు. అలానే భూ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ధరణి సమస్యలు, వాటి పరిష్కారంపై సీఎం చర్చించారు.  నెలకోసారి మండల రెవెన్యూ ఆఫీసుల్లో సదస్సులు నిర్వహించాలని, ఎన్నికల్లో ధరణి వ్యవస్థ రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై కూడా సీఎం చర్చించారు.

అలానే కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. వీటి గురించి పరస్పరంపై సహకారం ఉండాలని కిషన్ రెడ్డిని సీఎం కోరారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాపాలని మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మరి.. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments