iDreamPost
android-app
ios-app

యశోదలో చికిత్స పొందుతున్న మంత్రి వెంకట్ రెడ్డిని పరామర్శించిన సీఎం!

Revanth Reddy Meet Minister Venkat Reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కొంతకాలం నుంచి ఆయన గొంతు సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.

Revanth Reddy Meet Minister Venkat Reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కొంతకాలం నుంచి ఆయన గొంతు సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.

యశోదలో చికిత్స పొందుతున్న మంత్రి వెంకట్ రెడ్డిని పరామర్శించిన సీఎం!

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీశాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స మంత్రి వెంకట్ రెడ్డిని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. గత కొద్దిరోజులుగా మంత్రి గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రిలో చేరి… చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. ఆస్పత్రికి వెళ్లి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి పరామర్శించారు. అంతేకాక ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కూడా మంత్రి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హైటెక్ సిటీలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇక కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానం. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతల్లో ఆయన ఒకరు గతంలో వైఎస్ హయాంలో మంత్రిగా కూడా ఆయన పని చేశారు. తాజాగా పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ అంటే కోమటి రెడ్డి అనేలా ఆయన జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవల నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన సోదరుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా  మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడంలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించారు.

komati reddy in hospital

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత కొంతకాలం నుంచి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో ఒకసారి ఆస్పత్రికి వెళ్లి చికిత్స కూడా చేయించుకున్నారు. అయినా మరోసారి ఇబ్బంది పెట్టడంతో తిరిగి హైటెక్ సిటీలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స. ఇప్పటికే మంత్రి వెంకట్ రెడ్డిని పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. అంతేకాక వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా మంత్రిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోదా ఆస్పత్రికి వెళ్లి మంత్రి వెంకట్ రెడ్డి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.