P Krishna
CM Revanth Reddy Key Order: తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ పథకాల్లో జరిగిన అవినీతిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
CM Revanth Reddy Key Order: తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ పథకాల్లో జరిగిన అవినీతిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
P Krishna
గత ఏడాది తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు గుడ్ బై చెప్పారు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలపై విశ్వాసం చూపిస్తూ.. ఆ పార్టీకి పట్టం కట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యలు చేపట్టిన తర్వాత పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆరు గ్యారెంటీ పథకాల్లో రెండు గ్యారెంటీ పథకాలు అమలు చేశారు. మహాలక్ష్మ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. ఆరు గ్యారెంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాను. తాజాగా గొర్రెలు, చేపల పంపిణీ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో భారీ కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలు ఏంటో తెల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాలు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు లబ్దిదారుల ఎంపిక మొదలు గొర్రెల కొనుగోలు, పంపిణీ విషయాల్లో ఏం జరిగిందన్న విషయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆయన చెప్పారు. విజిలెన్స్ ఇచ్చే ప్రాథమిక నివేదికలతో ఏదైనా అవకతవకలు జరిగినట్లు తేలినా.. అవినీతికి పాల్పపడినా వారి వివరాలు ఏసీబీకి అప్పగించాలని అధికారులకు సూచించారు. మంగళవారం సెక్రటేరియట్ లో పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహంచి ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను కొంతమంది అధికారులు బినామీ పేర్లతో సొంత ఖాతాలకు మల్లించుకున్న కేసులో ఏసీబీ దర్యాప్తు చేస్తున్న విషయాన్న గుర్తు చేస్తూ.. శాఖా పరంగా వివరాలు ఏమీ సేకరించలేదా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2017 లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు రూ.3,955 కోట్ల రుణం ఇచ్చిన నేషనల్ కో ఆపరేటీవ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ రెండవ విడతకు ఎంతుకు రుణం ఇవ్వలేదని అధికారులను ప్రశ్నించారు. సీఎం అడిగిన ప్రశ్నకు సమాధానంగా కాగ్ వివిధ అభ్యంతరాలు తెరపైకి తీసుకు వచ్చిన కారణంగా ఎన్సీడీసీ రుణం ఇవ్వలేదని అన్నారు. ఇకపై ప్రతి మండలంలో వెటర్నరీ ఆస్పత్రులు తప్పకుండా ఉండాలని.. 91 కొత్త మండలాల్లోనూ అవసరమైన చోట ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మొబైల్ వెటర్నరీ క్లీనిక్ సేవలను తప్పకుండా కొనసాగించాలని.. అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని అన్నారు.