iDreamPost
android-app
ios-app

రైతులకు సీఎం రేవంత్‌ రెడ్డి గుడ్‌ న్యూస్‌.. రుణమాఫీ కోసం ప్రత్యేకంగా

  • Published May 16, 2024 | 8:55 AMUpdated May 16, 2024 | 8:55 AM

తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర రైతులకు రుణమాఫీ చేస్తానన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై అలాగే రైతు రుణమాఫీ పై సర్కార్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర రైతులకు రుణమాఫీ చేస్తానన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై అలాగే రైతు రుణమాఫీ పై సర్కార్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

  • Published May 16, 2024 | 8:55 AMUpdated May 16, 2024 | 8:55 AM
రైతులకు సీఎం రేవంత్‌ రెడ్డి గుడ్‌ న్యూస్‌.. రుణమాఫీ కోసం ప్రత్యేకంగా

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుగు కొనసాగుతన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చే క్రమంలో.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తనదైన మార్క్‌ వేసుకున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలలో కొన్ని అమలు చేసే దిశగా అడగులు వేస్తున్న సర్కార్‌.. మరోవైపు రాష్ట్రంలో ఉన్న రైతుల గురించి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రైతన్నలకు కూడా ఇచ్చిన హామీలను నేరవేర్చుతో ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా.. రైతులకు రుణమాఫీ చేస్తాననే హామీ కూడా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ విషయం పై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర రైతులకు రుణమాఫీ చేస్తానన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై అలాగే రైతు రుణమాఫీ పై సర్కార్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక తాజాగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కాగా, ఆ సమావేశంలో రైతు రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇక అందుకు అవసరమైన అన్ని ఏర్పాట‍్లు చేయాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అయితే ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలపై అధికారులతో చర్చించారు.  ఇకపోతే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను నిర్ణీత సమయంలో సర్దుబాటు చేయాలని అధికారులకు సీఎం  రేవంత్‌ రెడ్డి సూచించారు. అందుకోసం భారీ మొత్తంలో  నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని తెలిపారు.

ఇక రాష్ట‍్రంలో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని సర్కార్‌ పేర్కొన్నారు. అదే విధంగా రైతు నుంచి పంటనుకొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని, కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయితే డిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని, దీంతో పాటు అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి