Dharani
Rajiv Gandhi Civils Abhaya Hastham: తెలంగాణ సర్కార్ మరో హామీని నిలబెట్టుకుంది. వారి ఖాతాలో రూ.లక్ష జమ చేసింది. అర్హులైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆ వివరాలు..
Rajiv Gandhi Civils Abhaya Hastham: తెలంగాణ సర్కార్ మరో హామీని నిలబెట్టుకుంది. వారి ఖాతాలో రూ.లక్ష జమ చేసింది. అర్హులైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చడం మాత్రమే కాక.. ప్రజా సంక్షేమం కోసం అనేక నిర్ణయాలను తీసుకుంటూ.. ముందుకు సాగుతోంది. ఇక విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సమాజంలోని అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం నిర్ణయాలు, పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ మరో హామీని నిలబెట్టుకుంది. వారి ఖాతాలో రూ. లక్ష జమ చేసింది. ఇందుకు అర్హులైన వారి జాబితాను కూడా విడుదల చేసింది. ఆ వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. పేద, మధ్యతరగతి వారికి సివిల్స్ ప్రిపరేషన్ ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో పాసై.. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారికి ఒక్కొక్కరికీ రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని.. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ అయిన వారికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి.. రూ.లక్ష చెక్కును అందించారు. అంతేకాక మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ అయిన వారి లిస్ట్‌ను కూడా జిల్లాల వారీగా అధికారులు విడుదల చేశారు. వారందరి ఖాతాలో రూ.లక్ష జమ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సెక్రటేరియట్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారికి రూ.లక్ష చెక్కును రేవంత్ రెడ్డి స్వయంగా తన చేతుల మీదుగా అందించారు.
ఇక ఈ ఏడాది తెలంగాణ నుంచి మెయిన్స్ పరీక్షకు మొత్తం 135 మంది అర్హత సాధించారు. వారందరికీ రూ.లక్ష చొప్పున సీఎం ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇక ఈ 135 అభ్యర్థుల్లో 113 మంది పురుషులు ఉండగా.. 22 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇక వారిలో 21 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు కాగా.. 62 మంది ఓబీసీ, 19 మంది ఎస్సీ, 33 మంది ఎస్టీ కేటగిరీకి చెందిన వారు ఉన్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. అలానే జిల్లాల వారిగా జాబితాను విడుదల చేశారు.
Hon’ble Chief Minister Sri. A. Revanth Reddy participates in Rajiv Gandhi Civils Abhaya Hastham – Distribution of Cheques at Secretariat https://t.co/Ya2VSLZypB
— Telangana CMO (@TelanganaCMO) August 26, 2024