KCR ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా.. గ్రీన్ ఛానల్ ఏర్పాటు!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ కి వెళ్లారు. నిన్న రాత్రి అనుకోని ప్రమాదానికి గురి కావడంతో యశోద ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ కి వెళ్లారు. నిన్న రాత్రి అనుకోని ప్రమాదానికి గురి కావడంతో యశోద ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న రాత్రి ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ బాత్రూమ్ లో కాలుజారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తుంటికి తీవ్ర గాయం అయింది. వెంటనే ఆయనను సోమాజి గుడ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఐసీయూకి పంపించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. సాయంత్రం వరకు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయాల్సి ఉంటుందని యశోద డాక్టర్లు హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు.   ఆయన కోలుకోవడానికి దాదాపు ఎనిమిది వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ కి గాయం అయిన విషయం తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కి నిన్న రాత్రి గాయం గాయం కావడంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం రాత్రి ప్రభుత్వ దృష్టికి రావడవంతో వెంటనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేసీఆర్ కి మెరుగైన వైద్యం అందించాలని యశోద ఆసుపత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం దేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి వెంటనే యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ కి అందుతున్న వైద్యం గురించి యశోద ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న సమాచారం రేవంత్ రెడ్డికి అందించారు. వాస్తవానికి ఈ విషయం రాత్రే ప్రభుత్వ దృష్టికి రావడంతో వెంటనే స్పందించి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లీయరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తూనే ఉన్నారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ పాలన కొనసాగించింది. తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు కానుంది.. ఈ సమావేంలో స్పీకర్, ప్రొటెం స్పీకర్ కి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ జరగనుంది. తర్వాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కేసీఆర్ కి జరిగిన ఘటన.. ప్రభుత్వం స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments