iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అస్వస్థత!

  • Published Dec 25, 2023 | 1:22 PM Updated Updated Dec 25, 2023 | 1:22 PM

ఈ నెల 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ నెల 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

బ్రేకింగ్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అస్వస్థత!

తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుకుంటున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల భీమా పథకాలను ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పై అమలుపై దృష్టి సారిస్తున్నారు. మిగతా గ్యారెంటీలు కూడా వంద రోజుల్లో పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత కొన్నిరోజులుగా వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా ఆయన దగ్గు, జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇంటివద్దే ఫ్యామిలీ డాక్టర్లు రేవంత్ రెడ్డిని పరీక్షిస్తూ మెడిసన్లు అందజేస్తున్నారు. వాటిని వాడుతూనే సీఎం తన రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఆదివారం సచివాలయంలో సీఎం జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో ఆయన నీరసంగా కనిపించారు. అసెంబ్లీ సమావేశాలు గురువారం ముగిశాయి. మరుసటి రోజు నుంచే ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వైద్యులు సూచించిన మందులు వాడుతు.. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారు.

cm revanth reddy got fever

 ఇదిలా ఉంటే..  రాష్ట్రంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ కార్మికులకు ర.5 లక్షల ప్రమాద భీమా ప్రకటించారు. అంతేకాదు ప్రమాద భీమాతో పాటు రూ.10 లక్షల వరకు ఉచిత చికిత్స కూడా అందనుంది. దీంతో ఎంతోమంది అసంఘటిత రంగంలో పనిచేసేవారికి భద్రత లభించిందని అంటున్నారు. సీఎం వరుస కార్యక్రమాలతో బీజీగా ఉండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్కటీ అమలు చేస్తామని.. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.